Smartphone: మీ స్మార్ట్‌ఫోన్‌లో వైరస్‌ ఎలా చేరుతుంది..? సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి..?

Smartphones Virus: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల వాడకం ఎక్కువైపోయింది. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్‌ఫోన్‌ ఉంటోంది. అందులో గేమ్స్‌, రకరకాల యాప్స్‌..

Smartphone: మీ స్మార్ట్‌ఫోన్‌లో వైరస్‌ ఎలా చేరుతుంది..? సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి..?
Follow us
Subhash Goud

|

Updated on: Apr 23, 2022 | 5:05 PM

Smartphone Virus: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల వాడకం ఎక్కువైపోయింది. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్‌ఫోన్‌ ఉంటోంది. అందులో గేమ్స్‌, రకరకాల యాప్స్‌ (Apps) కుప్పలు తెప్పలుగా వేసుకుంటారు. ఈ డిజిటల్‌ ప్రపంచంలో మునిగితేలుతున్న ఈ కాలంలో ఫోన్‌లకు భద్రత ఎంతో అవసరం. స్మార్ట్‌ఫోన్‌లలో ఇష్టానుసారంగా యాప్స్‌ వేసుకుంటే వైరస్‌ చొరబడి ఇబ్బందులకు గురి చేస్తుంది. పలు యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం వల్ల వైరస్‌లు మీ ఫోన్‌లో చేరడంతో మోసపోయేందుకు ఆస్కారం ఉంది. స్మార్ట్‌ఫోన్‌లలోనే కాకుండా కంప్యూటర్‌, ల్యాప్‌లాప్‌లలో కూడా వైరస్‌ చేరి నాశనం చేస్తుంటుంది. ఇక కొన్ని పద్దతుల ద్వారా వైరస్‌ను నివారించవచ్చంటున్నారు టెక్‌ నిపుణులు. మీరు ఏదైనా యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసే ముందు కొన్ని విషయాలను పరిశీలించాలి. యాప్‌ స్టోర్‌లలో ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ ఉండాల్సిన అవసరమేమి లేదు. కొన్ని సార్లు ఫేక్‌ రేటింగ్స్‌ ద్వారా యాప్‌ ట్రెండింగ్‌లోకి వస్తుంది. దీని తర్వాత యాప్‌ డెవలపర్‌ ఎవరో అనేది తప్పకుండా తనిఖీ చేయాలి. ఈ సమాచారాన్ని యాప్‌ స్టోర్‌లోనే పొందవచ్చు. మీరు డౌన్‌లోడ్‌ చేసే యాప్ మీ నుంచి ఎటువంటి అనుమతులను అడుగుతుందో గుర్తించాలి. ఉదాహరణకు.. మీరు అలారం యాప్‌ను డౌన్‌లోడ్‌ చేస్తే స్మార్ట్‌ఫోన్‌లోని ఫోటోలను చూసేందుకు అనుమతి అవసరం లేదు. అదే విధంగా కాలిక్యులేటర్‌ యాప్‌కు నెట్‌వర్క్‌ యాక్సెస్‌ అవసరం లేదు. మీ మొబైల్‌ పదేపదే క్రాష్‌ అవుతూ ఉంటుంది.

చిక్కులు పెట్టే యాప్స్‌:

కొన్ని సమయాల్లో కొంత మంది స్నేహితుల నుంచి వచ్చిన లింక్స్‌ ద్వారా యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. కొంత మంది apk ఫైల్‌ నుంచి యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే కొంత మంది థర్డ్‌పార్టీ స్టోర్‌ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. ఇలాంటివి చాలా చిక్కులు తెచ్చి పెడతాయి. కంప్యూటర్‌, ల్యాప్‌లాప్‌లలో యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేయడం వల్ల కూడా వైరస్‌ వచ్చే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. మీ ఫోన్‌లో వైరస్‌ ఉంటే స్లో అయిపోతుంటుంది. అవసరం లేని యాప్స్‌ను తొలగించండి. ఏదైనా యాప్స్‌ ఓపెన్‌ చేయగానే స్లో కావడం, స్టాక్‌ అయితే అలాంటి యాప్స్‌ను డిలీట్‌ చేయండి.

పబ్లిక్ Wi-Fiని వాడకపోవడం మంచిది:

రైల్వే స్టేషన్లు, ఎయిర్‌ పోర్టులు, ఇక పబ్లిక్‌ ఎక్కువగా ఉండే ప్రధాన కూడళ్లలో, షాపింగ్‌ మాల్స్‌ దగ్గర ఉండే ఉచిత వైఫైతో మీ ఫోన్‌ను కనెక్ట్‌ చేయవద్దు. అలాంటి నెట్‌వర్క్‌లు సురక్షితం కావని గమనించుకోండి. ఉచిత వైఫై వల్ల హ్యాకర్‌లు మిమ్మల్ని టార్గెట్‌ చేయవచ్చు. మీ మొబైల్‌లో డేటా లేకపోతే.. అత్యవసర సమయాల్లో మాత్రమే రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, ఇతర ప్రాంతాల్లో మాత్రమే వైఫై కనెక్టు చేసుకోండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Honda Bikes: హోండా కంపెనీ కీలక నిర్ణయం.. త్వరలో సరి కొత్త బైక్‌లు.. పెట్రోల్‌ ధరల నుంచి విముక్తి పొందవచ్చు!

Google: గూగుల్‌ కీలక నిర్ణయం.. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు పెద్ద షాక్‌..!

Smartphone Overheating: వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్‌ వేడెక్కుతోందా..? ఈ చిట్కాలను వాడండి..!