AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honda Bikes: హోండా కంపెనీ కీలక నిర్ణయం.. త్వరలో సరి కొత్త బైక్‌లు.. పెట్రోల్‌ ధరల నుంచి విముక్తి పొందవచ్చు!

Honda Bikes: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు డిమాండ్ పెరిగిపోతోంది. చాలా మంది..

Honda Bikes: హోండా కంపెనీ కీలక నిర్ణయం.. త్వరలో సరి కొత్త బైక్‌లు.. పెట్రోల్‌ ధరల నుంచి విముక్తి పొందవచ్చు!
Follow us
Subhash Goud

|

Updated on: Apr 23, 2022 | 2:41 PM

Honda Bikes: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు డిమాండ్ పెరిగిపోతోంది. చాలా మంది ఈవీ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక తాజాగా హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ ఇండియా కీలక ప్రకటన చేసింది. తాము ప్లెక్స్‌ ఫ్యూయల్‌ కమ్యూటర్‌ మోటార్‌ సైకిల్‌ను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే దేశంలో విడుదల చేస్తామని తెలిపింది. దేశంలో రెండో అతిపెద్ద ద్విచక్ర వాహనాల కంపెనీ అయిన హోండా మోటార్‌ తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇది. హోండా ఇప్పటికే బ్రెజిల్‌లో ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ మోటార్‌ సైకిళ్లను విక్రయిస్తోంది. ఫ్లెక్స్‌ ప్యూయల్‌ ఇంజిన్లతో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బైక్‌లను భారత్‌లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు హోండా మోటార్‌ తెలిపింది. ఈ ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ (Flex Fuel Engines) ఇంజిన్లు పెట్రోల్‌, ఇథనాల్‌ (Ethanol) రెండింటితో నడుస్తాయి. హోండా ఈ వాహనాలను మార్కెట్లోకి తీసుకువస్తే టీవీఎస్‌ మోటారు తర్వాత ఈ బ్రాండ్‌ తీసుకువచ్చిన రెండో కంపెనీగా నిలువనుంది. అయితే టీవీఎస్‌ కంపెనీ నుంచి ఇప్పటికే ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ఇంజిన్‌తో తయారు చేసిన బైకు అపాచీ ఆర్‌టీఆర్‌200 ఎఫ్‌ఐ ఈ100ను భారత మార్కెట్లో విడుదల చేసింది.

ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ఇంజిన్లు అంటే ఏమిటి?

ఫ్లెక్స్ ఇంధన ఇంజిన్‌లతో వాహనాల ట్యాంకులకు వివిధ రకాల ఇంధనాలను జోడించవచ్చు. వాహనాన్ని పెట్రోల్, పెట్రోల్ తోపాటు ఇథనాల్ మిశ్రమాన్ని ఏ నిష్పత్తిలోనైనా లేదా స్వచ్ఛమైన ఇథనాల్‌తో నడపవచ్చు. దీని కోసం పెట్రోల్ ఇంజిన్‌లో ఇంధన పంపు, నియంత్రణ మాడ్యూల్‌లో మార్పులు చేస్తారు. అయితే ఈ ఇంజిన్‌లో ఉపయోగించే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ధర రూ. 60-62 ఉంటుంది. అంటే లీటరుకు రూ. 35-40 ఆదా చేసుకోవచ్చు. శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుంది. దేశంలో కాలుష్య స్థాయి కూడా తగ్గుతుంది.

త్వరలో ఎలక్ట్రిక్‌ బైక్‌లు..

త్వరలో మరిన్ని ఎలక్ట్రిక్‌ బైక్‌లను విడుదల చేస్తామని హోండా కంపెనీ వెల్లడించింది. వీటిని తయారు చేసేందుకు హోండా మోటారు తన కంపెనీకి చెందిన ఇతర సబ్సిడరీల నుంచి సాయం పొందనుంది. అయితే ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ఇంజిన్‌తో నడిచే హోండా సీజీ150 టైటాన్‌ మిక్స్‌ను 2009లో బ్రెజిల్‌లో విడుదల చేసింది. ఈ బైక్‌ పెట్రోల్, ఇథనాల్‌ రెండింటితో నడుస్తుంది. ఆ తర్వాత ఎన్‌ఎక్స్ఆర్ 150, బ్రోస్ మిక్స్, బీఐజెడ్ 125 ఫ్లెక్స్‌ బైకులను హోండా బ్రెజిల్‌లో ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్లతో విడుదల చేసింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

EV Battery Safe Tips: ఈ టిప్స్‌ పాటించండి.. మీ ఎలక్ట్రిక్ వాహనాన్ని సురక్షితంగా ఉంచుకోండి..!

Swapping Policy: ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుదారులకు కేంద్ర సర్కార్‌ శుభవార్త.. ఏంటంటే..!