EV Battery Safe Tips: ఈ టిప్స్‌ పాటించండి.. మీ ఎలక్ట్రిక్ వాహనాన్ని సురక్షితంగా ఉంచుకోండి..!

EV Battery Safe Tips: ఎలక్ట్రిక్ వెహికల్! వాటడం సులభం!! ఖర్చు తక్కువ.. మన్నిక ఎక్కువ.. ఇది నాణ్యానికి ఒక వైపే.. ఎప్పుడు అంటుకుంటుందో తెలియదు..

EV Battery Safe Tips: ఈ టిప్స్‌ పాటించండి.. మీ ఎలక్ట్రిక్ వాహనాన్ని సురక్షితంగా ఉంచుకోండి..!
Ev
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 23, 2022 | 1:11 PM

EV Battery Safe Tips: ఎలక్ట్రిక్ వెహికల్! వాటడం సులభం!! ఖర్చు తక్కువ.. మన్నిక ఎక్కువ.. ఇది నాణ్యానికి ఒక వైపే.. ఎప్పుడు అంటుకుంటుందో తెలియదు.. మరెప్పుడు ప్రాణాలు తీస్తుందో తెలియదు.. ఇది నాణానికి రెండో వైపు. ఎక్కడపడితే అక్కడ ప్రమాదాలకు గురవుతున్నాయి ఎలక్ట్రికల్‌ వాహనాలు. ఈ వరుస ఘటనలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఇంధన ధరలు పెరుగుతుండటంతో జనాలంతా ఎలక్ట్రిక్ వాహనాలవైపు చూస్తున్న దశలో ఈ ప్రమాదాలు చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే, ఎండ వేడిమి కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతున్నాయనే టాక్ నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ.. వేసవి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. వేడెక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి:

మొదటగా ఎలక్ట్రిక్ వాహనాన్ని వేడికి గురికాకుండా చూడాలి. ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎక్కువసేపు ఎండలో ఉంచొద్దు. ఎండలో వాహనాన్ని పార్క్ చేయొద్దు. షెడ్స్ కింద, నీడ ప్రాంతంలో మీ వాహనాన్ని పార్క్ చేయాలి.

2. ఒరిజినల్ ఛార్జర్‌ని ఉపయోగించాలి:

బ్యాటరీలకు ఏదైనా నష్టం జరగకుండా నిరోధించడానికి తప్పనిసరిగా బ్యాటరీకి అనుకూలంగా ఉండే అధీకృత లేదా ఒరిజినల్ ఛార్జర్‌ని ఉపయోగించాలి.

3. తరచుగా ఛార్జింగ్ చేయొద్దు:

బ్యాటరీని తరచుగా ఛార్జ్ చేయొద్దు. బ్యాటరీని రీఛార్జ్ చేయడానికి ముందు బ్యాటరీని కూల్ అయ్యేంత వరకు ఉంచాలి.

4. బ్యాటరీ డ్యామేజ్ లేదా లీకేజీ గుర్తించాలి:

మీ వాహనం బ్యాటరీలో ఏదైనా లీక్ లేదా డ్యామేజీని గమనించినట్లయితే వెంటనే పరికరాన్ని వేరు చేసి డీలర్‌కు సమాచారం అందించారు.

5. ఆప్టిమల్ ఛార్జ్ నిర్వహించాలి:

వాహనం ఎక్కువసేపు పార్క్ చేసినప్పుడు పూర్తిగా ఛార్జ్ చేయబడిన లేదా పూర్తిగా ఛార్జ్ పడిపోయిన బ్యాటరీ రెండూ మీ వాహన సామర్థ్యాన్ని క్షీణింపజేస్తాయి. కావున, 20 శాతం నుంచి 80 శాతం మధ్యలో ఛార్జింగ్ నిర్వహించడం ఉత్తమం.

Also read:

DK Aruna – BJP: గద్వాల్ గడ్డపై డీకే అరుణ మాస్టర్ ప్లాన్ ఇదేనా?.. నెక్ట్స్ ఎన్నికల్లో ఏం జరుగుతోంది?..

Andhra Pradesh: 20 రోజులవుతోంది.. ఆ ఫైర్ బ్రాండ్ ఎక్కడ?.. గుడివాడలో జోరుగా సాగుతున్న చర్చ..!

PK – Congress: కాంగ్రెస్‌ కోసం పీక్స్‌లో పీకే వ్యూహాలు.. ఆ నివేదిక లీక్స్ అందుకోసమేనా..!

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!