PK – Congress: కాంగ్రెస్‌ కోసం పీక్స్‌లో పీకే వ్యూహాలు.. ఆ నివేదిక లీక్స్ అందుకోసమేనా..!

PK - Congress: టెన్‌ జన్‌పథ్‌ ప్రొడక్షన్స్‌.. పీకే సమర్పించు.. కాంగ్రెస్‌ సరికొత్త చిత్రం. అవును.. దేశవ్యాప్తంగా కొడిగడుతున్న కాంగ్రెస్‌కు కొత్త జీవం

PK - Congress: కాంగ్రెస్‌ కోసం పీక్స్‌లో పీకే వ్యూహాలు.. ఆ నివేదిక లీక్స్ అందుకోసమేనా..!
Pk
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 23, 2022 | 9:54 AM

PK – Congress: టెన్‌ జన్‌పథ్‌ ప్రొడక్షన్స్‌.. పీకే సమర్పించు.. కాంగ్రెస్‌ సరికొత్త చిత్రం. అవును.. దేశవ్యాప్తంగా కొడిగడుతున్న కాంగ్రెస్‌కు కొత్త జీవం పోసేందుకు నయా ఫార్ములా సూచించారట రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ.. సార్‌ చూపించబోయే ఆ కొత్త సినిమా ఎలా ఉండబోతోంది?

పూర్వ వైభవం కోసం తపిస్తున్న గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ కాంగ్రెస్‌.. లైమ్‌లైట్‌లోకి వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు అధినేత్రి సోనియా గాంధీ. ఏ రాష్ట్రంలో, ఏ పార్టీ కోసం పనిచేసినా సరే.. నేరుగా ఆయా పార్టీల అధినేతలతో మాత్రమే ఎన్నికల వ్యూహాలపై చర్చించే ప్రశాంత్ కిశోర్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విషయంలోనూ అదే చేశారు. కాకపోతే ఇంకో అడుగు ముందుకేసి, ఏకంగా పార్టీలో సభ్యుడయ్యేందుకు కూడా సిద్ధపడ్డారు. ఏ పదవి ఇవ్వాలన్న విషయంపై కాంగ్రెస్ పెద్దలు తర్జనభర్జన పడుతున్నప్పటికీ, ఆయన ఏ పదవిలో ఉన్నా సరే.. అత్యంత ముఖ్యుడవుతాడన్నది మాత్రం నిర్వివాదాంశం.

పార్టీ పునర్వైభవం కోసం 6 సూత్రాలను ప్రతిపాదించారు. రీ ఇన్‌కార్నేషన్ ఆఫ్ కాంగ్రెస్ పేరుతో రూపొందించిన వ్యూహాల నివేదికలో కాంగ్రెస్ పార్టీ ఆత్మను కాపాడుకుంటూ, కొత్త శరీరాన్ని నిర్మించడం అనే కాన్సెప్ట్ చూపించారు. ఇందులో నిర్మొహమాటంగా కాంగ్రెస్ మీదున్న కుటుంబ వారసత్వ రాజకీయాలు, అవినీతి ముద్రల గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ బలహీనతలను లోతుగా అధ్యయనం చేసి, విశ్లేషించి మరీ ఎత్తిచూపారు. వాటిని అధిగమించేందుకు ఏం చేయాలో దారిచూపించారు. రానున్న 2024 ఎన్నికల్లో ఎక్కడ పొత్తులు పెట్టుకోవాలి, ఎక్కడ ఒంటరి పోరు చేయాలన్నది కూడా సూచించారు.

తమిళనాడులో డీఎంకేతో, మహారాష్ట్రలో ఎన్సీపీతో, బెంగాల్‌లో తృణమూల్‌తో, జార్ఖండ్‌లో జేఎంఎంతో కలిసి వెళ్లడం మేలని.. కాంగ్రెస్‌ హైకమాండ్‌ ముందు ప్రతిపాదించారు పీకే. జమ్మూ-కశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌, ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడి భాగస్వామ్య పక్షాలతో కలిసి వెళ్లడం కాంగ్రెస్‌కు మేలు చేస్తుందని సూచించారు. తెలంగాణలో మాత్రం ఒంటరి పోరాటమే.. పార్టీకి కలిసొస్తుందని సూచించారు ప్రశాంత్‌ కిషోర్‌.

యూపీఏ ఛైర్‌పర్సన్‌గా పాతతరం కాంగ్రెస్‌ నాయకుల్ని పెట్టి, కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగాలనీ.. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా గాంధీయేతర నాయకుణ్ని నియమించాలనీ సూచించారు పీకే. పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా రాహుల్‌గాంధీని ఎన్నుకొని కోఆర్డినేషన్‌ జనరల్‌ సెక్రటరీగా ప్రియాంకా గాంధీకి బాధ్యతలు అప్పగించాలని అధినేత్రి ముందుప్రతిపాదించారు. రాహుల్‌ను పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా చేయడం వల్ల చట్టసభలో ప్రధాని ‘వర్సెస్‌’ రాహుల్‌ గాంధీగా పరిస్థితి మారుతుందన్నది పీకే సూచన.

పార్టీలో ‘ఒక వ్యక్తి – ఒకే పదవి’అనే సిద్ధాంతాన్ని అనుసరించాలని సోనియాకు సూచించారు పీకే. అన్ని స్థాయిల్లోనూ ఎన్నికలు నిర్వహించి పార్టీ అనుబంధ సంస్థలను ప్రక్షాళన చేయాలన్నారు. దేశవ్యాప్తంగా 15 వేల మంది నిబద్ధత గల నాయకులను, కోటి మంది క్రియాశీలక కార్యకర్తలను గుర్తించి వారికి పార్టీ ప్రధాన బాధ్యతలు అప్పగించాలని సూచించారు పీకే. పార్టీ సంస్థాగతంగా రెండు విధాలుగా పని చేయాలనీ.. ఒకటి కాంగ్రెస్‌ను ‘పాన్‌ ఇండియా పార్టీ’గా విస్తరించడంపై దృష్టి సారిస్తే, రెండోది 2024 ఎన్నికలకు అవసరమైన బలమైన వ్యవస్థను సృష్టించడంపై ఫోకస్‌ పెట్టాలనీ సూచించారు పీకే.

ఇదంతా బానే ఉంది.. ఈ ఐడియాల పేపర్ లీకేజి వెనుక అసలు వ్యూహమేంటన్నదే డౌట్‌గా ఉంది. ప్రత్యర్థిని తప్పుదారి పట్టించడం కోసమే పేపర్ లీక్ చేశారా? లేక కాంగ్రెస్ శ్రేణుల్లో ఇప్పటి నుంచే కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారా? అనేది అర్థం కాని పీకే స్ట్రాటజీలా ఉంది.

Also read:

Boris on Russia – Ukraine War: రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై సంచలన కామెంట్స్ చేసిన బ్రిటన్ ప్రధాని.. ఇంతకీ ఏమన్నారంటే..

Andhra Pradesh: ఇలాంటి రేస్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే..!

AP News: ‘ఏ బావ కళ్లల్లో ఆనందం కోసం చేశారు’.. ఎవరినీ వదిలిపెట్టను.. ఏబీవీ సీరియస్ వార్నింగ్..