AP News: ‘ఏ బావ కళ్లల్లో ఆనందం కోసం చేశారు’.. ఎవరినీ వదిలిపెట్టను.. ఏబీవీ సీరియస్ వార్నింగ్..

Andhra Pradesh: ‘నేను లోకల్‌. ఎవరినీ వదిలిపెట్టను. ఏ బావ కళ్లల్లో ఆనందం కోసం ఇదంతా చేశారు?’ సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత సీనియర్‌ ఐపీఎస్ అధికారి ఏబీ..

AP News: ‘ఏ బావ కళ్లల్లో ఆనందం కోసం చేశారు’.. ఎవరినీ వదిలిపెట్టను.. ఏబీవీ సీరియస్ వార్నింగ్..
Ab Venkateshwar Rao
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 23, 2022 | 8:47 AM

Andhra Pradesh: ‘నేను లోకల్‌. ఎవరినీ వదిలిపెట్టను. ఏ బావ కళ్లల్లో ఆనందం కోసం ఇదంతా చేశారు?’ సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత సీనియర్‌ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రియాక్షన్‌ ఇది. తనను అన్యాయంగా సస్పెండ్‌ చేసిన వారిపై చర్యలు తీసుకునే వరకు వదిలిపెట్టబోనని శపథం చేశారు. తనపై సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో త్వరలోనే డ్యూటీలో చేరతానన్నారు ఏబీవీ.

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను రద్దు చేసింది అత్యున్నత ధర్మాసనం. సస్పెండ్‌ అయి రెండేళ్లు పూర్తయినందున ఆయన్ను సర్వీస్‌లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంకా సస్పెన్షన్‌ను కొనసాగించొద్దని స్పష్టం చేసింది. 1969 అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం రెండేళ్లకు పైగా సస్పెన్షన్ కొనసాగబోదని తేల్చిచెప్పింది. 2022 ఫిబ్రవరి 8 నుంచి అన్ని బెనిఫిట్స్ ఆయనకు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై 2020 ఫిబ్రవరి 8న ఏబీవీని సస్పెండ్‌ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అప్పటి నుంచి ఒకవైపు విచారణ కొనసాగుతోంది. మరోవైపు సస్పెన్షన్‌ కూడా కంటిన్యూ అవుతోంది. దీనిపైనే ఏబీవీ హైకోర్టుకు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు. చివరకు ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పింది అత్యున్నత ధర్మాసనం.

తీర్పు తర్వాత మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు.. సినిమా స్టైల్లో పంచ్‌ డైలాగ్‌లు చెప్పారు. ఏ బావ కళ్లల్లో ఆనందం కోసం ఇదంతా చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వాలు వస్తుంటాయ్‌-పోతుంటాయ్‌ అని, తన సర్వీస్‌లో పన్నెండు బ్యాచ్‌లను చూశాని, తాను లోకల్‌ ఎవ్వరినీ వదిలిపెట్టబోనని వార్నింగ్‌ ఇచ్చారు ఏబీవీ. ఇదే సమయంలో కొందరు అధికారుల తీరుపైనా హాట్ కామెంట్స్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది కాబట్టి త్వరలోనే డ్యూటీలో జాయిన్‌ అవుతానన్నారు ఏబీవీ.

Also read:

AP: ఏపీలో రేషన్ కార్డుదారులకు కీలక అప్‌డేట్‌.. కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్

America Jobs: విదేశీ కొలువుల కలలు ఖల్లాస్‌.. అలంటి వారిపై కొరడా ఝళిపిస్తున్న అగ్రరాజ్యం..

Chest Pain: ఛాతిలో నొప్పిగా ఉంటే ఇవి తీసుకోవద్దు.. శరీరానికి చాలా నష్టం..!