AP: ఏపీలో రేషన్ కార్డుదారులకు కీలక అప్‌డేట్‌.. కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్

ఏపీలో రేషన్ కార్డుదారులకు కీలక అప్‌డేట్‌ ఇది. యస్, రేషన్ బియ్యానికి నగదు బదిలీ పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం.

AP: ఏపీలో రేషన్ కార్డుదారులకు కీలక అప్‌డేట్‌.. కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్
Ap Ration
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 23, 2022 | 8:40 AM

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యానికి నగదు బదిలీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు , పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు. రేషన్ కార్డుదారులకు నగదు బదిలీని ప్రస్తుతానికి పక్కన పెట్టామని చెప్పారు. యాప్‌లో సాంకేతిక లోపం వల్ల ప్రస్తుతానికి నగదు బదిలీ నిలిపివేశామని, నగదు బదిలీపై తర్వాత ఏమైనా నిర్ణయం తీసుకుంటే చెప్తామన్నారు. అటు రేషన్ బియ్యానికి నగదు బదిలీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను ఖండించారు కారుమూరి. పేద ప్రజలకు నగదు బదిలీ పథకంపై ప్రతిపక్ష పార్టీలు అపోహలు సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నగదు బదిలీ ప్రారంభించాలని‌ 2017లోనే కేంద్రం సూచించిందని గుర్తుచేశారు. కేంద్రం ఆదేశాలను అదే పార్టీ విస్మరించడం విడ్డూరంగా ఉందని సోము వీర్రాజుకు కౌంటర్ ఇచ్చారు. రేషన్ నగదు బదిలీ పథకాన్ని ముందు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో ఎలాంటి బలవంతం లేదన్న మంత్రి, ఇష్టం ఉన్న వాళ్లకి డబ్బులు బదిలీ చేస్తారని చెప్పారు. నగదు బదిలీ ఇష్టం లేని వాళ్లకి బియ్యం ఇస్తామని స్పష్టం చేశారు సివిల్‌ సప్లయ్‌ మంత్రి. బియ్యానికి ఇచ్చే డబ్బుల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఫైర్‌ అయ్యారు.

Also Read: Picture Puzzle: వాసి వాడి తస్సదియ్య.. ఈ ఫోటోలో చిరుతను కనిపెడితే మీరు తోపు అంతే..