Pawan Kalyan: నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనాని కౌలు రైతు భరోసా యాత్ర.. 41 మంది రైతులకు ఆర్ధిక సాయం..
Pawan Kalyan: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో(West Godavari) నేడు జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నారు. అన్నదాతకు..
Pawan Kalyan: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో(West Godavari) నేడు జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నారు. అన్నదాతకు అండగా చేపట్టిన ఈ యాత్రలో పలువురు రైతులకు ఆర్ధిక సాయం అందించనున్నారు. పవన్ కళ్యాణ్ .. హైదరాబాద్ నుంచి బయలుదేరి.. గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో విజయరాయి, ధర్మాజీ గూడెం, కలపర్రు టోల్‌గేటు మీదుగా జానంపేట, అక్కడి నుంచి ఏలూరు బైపాస్ మీదుగా విజయరాయి, పెదవేగి, ధర్మాజీగూడెం, లింగపాలెంకు.. అక్కడి నుంచి ధర్మాజీగూడెం మీదుగా చింతలపూడికి చేరుకోనున్నారు.
పవన్ కళ్యాణ్ చింతలపూడి లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కౌలు రైతుల కుటుంబాలను కలుసుకుని ఒక్కో కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని పవన్ కళ్యాణ్ అందించనున్నారు. చింతలపూడిలో రచ్చబండ కార్యక్రమంలో 41 మంది రైతులకు లక్ష రూపాయల చెక్ లు అందించనున్నారు. పవన్ కళ్యాణ్ యాత్ర నేపథ్యంలో ఇప్పటికే జనసేన నేతలు అన్ని ఏర్పాట్లను చేశారు. ఏలూరు, భీమవరం జిల్లాల్లో అప్పుల బాధతో 41 మంది కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడగా.. ఇందులో చింతలపూడి నియోజకవర్గంలోనే 31 కుటుంబాలు ఉన్నాయి.
” జనసేన కౌలు రైతు భరోసా యాత్ర ” పశ్చిమ గోదావరి జిల్లా ఏప్రిల్ 23 న చింతలపూడిలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయనున్న శ్రీ @PawanKalyan గారు.#JanaSenaRythuBharosaYatra pic.twitter.com/d3xGErACJV
— JanaSena Party (@JanaSenaParty) April 22, 2022
Also Read: Wonder Kid: 9 ఏళ్ల బాలుడు రికార్డుల వేట.. కళ్ళకు గంతలతో స్కేటింగ్.. మంత్రి రోజా ప్రశంసలు