Wonder Kid: 9 ఏళ్ల బాలుడు రికార్డుల వేట.. కళ్ళకు గంతలతో స్కేటింగ్.. మంత్రి రోజా ప్రశంసలు
Wonder Kid: ఏదైనా సాధించాలని.. తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని భావించడానికి వయసుతో సంబంధం లేదు. కావాల్సింది.. ఏదైనా సాధించాలనే సంకల్ప, పట్టుదల మాత్రమే. అందుకు ఉదాహరణగా..
Wonder Kid: ఏదైనా సాధించాలని.. తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని భావించడానికి వయసుతో సంబంధం లేదు. కావాల్సింది.. ఏదైనా సాధించాలనే సంకల్ప, పట్టుదల మాత్రమే. అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాడు ఈ చిన్నారి బాలుడు. సరికొత్త రికార్డు సృష్టించాలని ఓ బాలుడు కళ్ళకు గంతలు కట్టుకొని 150 కిలోమీటర్ల దూరం స్కేటింగ్(Skating) చేశాడు. చిత్తూరు జిల్లాకు (Chittoor District)చెందిన 9 ఏళ్ల బాలుడు సరికొత్త రికార్డ్ సృష్టించాడు. వివరాల్లోకి వెళ్తే..
చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన పెయింటర్ కృష్ణ కుమార్, లీలావతి దంపతుల కొడుకు భారతీరాజా. ఈ 9 ఏళ్ల బాలుడు స్కెటింగ్ లో మంచి ప్రతిభకలినాబాలుడు. దీంతో స్కెటింగ్ లో రికార్డ్ సృష్టించాలనున్నాడు. తన కళ్ళకు గంతలు కట్టుకుని.. ఏపీ కర్ణాటక సరిహద్దులోని నంగిలి టోల్ గేట్ నుంచి స్కెటింగ్ ప్రారంభించి.. నగరి వరకు సుమారు 150 కిలోమీటర్ల వరకు స్కెటింగ్ చేశాడు. సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఇలా స్కెటింగ్ చేస్తున్న సమయంలో భారతీరాజా కు గంగాధర నెల్లూరు, ఎస్ ఆర్ పురం, కార్వేటినగరం మండలాల పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. రికార్డ్ సృష్టించిన భారతీరాజాను మంత్రి రోజా అభినందించారు. అందరూ పోషకాహారం తీసుకోవాలన్న ఆశయంతో ఇలా స్కెటింగ్ చేసినట్లు భారతీరాజా చెప్పాడు.
Also Read: Modi Kashmir Tour: ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్ము కశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటన
Delhi: రాజధానిలో ఘోరం.. మహిళను వెంటాడిన దుర్మార్గుడు.. పిల్లల ముందే కిరాతకంగా..