Delhi: రాజధానిలో ఘోరం.. మహిళను వెంటాడిన దుర్మార్గుడు.. పిల్లల ముందే కిరాతకంగా..

Delhi Crime News: దేశ రాజధానిలో ఢిల్లీలో పట్టపగలు దారుణం చోటుచేసుకుంది. మహిళను వెంబడించిన ఓ వ్యక్తి.. ఆమె ఇద్దరు పిల్లల ముందే ఆమెను కిరాతకంగా చంపాడు.

Delhi: రాజధానిలో ఘోరం.. మహిళను వెంటాడిన దుర్మార్గుడు.. పిల్లల ముందే కిరాతకంగా..
Delhi Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 23, 2022 | 7:46 AM

Delhi Crime News: దేశ రాజధానిలో ఢిల్లీలో పట్టపగలు దారుణం చోటుచేసుకుంది. మహిళను వెంబడించిన ఓ వ్యక్తి.. ఆమె ఇద్దరు పిల్లల ముందే ఆమెను కిరాతకంగా చంపాడు. ఆమెను కత్తితో పొడిచి హత్యచేసిన అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం సాగర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నిందితుడు మహిళను వెంబడించి మరి చంపినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 2గంటల సమయంలో మహిళపై కత్తితో దాడి జరిగిందని సాగర్‌పుర్‌ పోలీసుస్టేషన్‌కు సమాచారం అందినట్లు తెలిపారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారన్నారు. ఆమె అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారని.. పోలీసులు పేర్కొన్నారు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. అయితే నిందితుడు మహిళను వెంబడిస్తున్నట్లు దానిలో కనిపించింది. నిందితుడు.. ఆమె వెంటపడుతుండగా.. బాధితురాలు ఇద్దరు పిల్లలతో పరిగెడుతూ కనిపించింది. ఈ క్రమంలో 2.10 గంటలకు పిల్లలు చూస్తుండగానే.. నడిరోడ్డుపై కత్తితో సదరు మహిళపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. మృతురాలు, నిందితుడు కొన్ని రోజుల క్రితం పక్కపక్క ఇళ్లలోనే ఉండేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో మహిళ కుటుంబంతో సహా వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడే నివస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని.. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Also Read:

Modi Kashmir Tour: ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్ము కశ్మీర్‌‌లో ప్రధాని మోదీ పర్యటన

YCP-Congress: కాంగ్రెస్‌తో పొత్తుపై వైసీపీ క్లారిటీ.. ప్రశాంత్ కిశోర్ కామెంట్స్‌పై విజయసాయిరెడ్డి రియాక్ట్‌