America Jobs: విదేశీ కొలువుల కలలు ఖల్లాస్‌.. అలంటి వారిపై కొరడా ఝళిపిస్తున్న అగ్రరాజ్యం..

America Jobs: విదేశీ కొలువుల కలలు ఖల్లాస్‌.. అలంటి వారిపై కొరడా ఝళిపిస్తున్న అగ్రరాజ్యం..

Anil kumar poka

|

Updated on: Apr 23, 2022 | 8:39 AM

విదేశాల్లో ఉద్యోగాల కోసం తప్పుడు పత్రాలు సమర్పిస్తున్న వారిపై అగ్రరాజ్యం కొరడా ఝళిపిస్తోంది. అభ్యర్థులు అందజేస్తున్న అనుభవ, రుణ ధ్రువీకరణ, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పత్రాలను ప్రైవేటు సంస్థల ద్వారా క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.


విదేశాల్లో ఉద్యోగాల కోసం తప్పుడు పత్రాలు సమర్పిస్తున్న వారిపై అగ్రరాజ్యం కొరడా ఝళిపిస్తోంది. అభ్యర్థులు అందజేస్తున్న అనుభవ, రుణ ధ్రువీకరణ, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పత్రాలను ప్రైవేటు సంస్థల ద్వారా క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. దాంతో అక్రమార్కుల బండారం బయటపడుతోంది. వీసా ఇంటర్వ్యూల సమయంలో ఈ నకిలీ పత్రాల గుట్టు రట్టవుతోంది. అభ్యర్ధులు సమర్పించిన పత్రాలపై అధికారులు ముందే ఆధారాలను సేకరించి, ఇంటర్వ్యూ సమయంలో వారి ముందు పెడుతుండటంతో కళ్లు తేలేస్తున్నారు. దిల్లీలోని అమెరికన్‌(యూఎస్‌) ఎంబసీలో మార్చి 24 నుంచి ఏప్రిల్‌ 10 వరకూ ఇంటర్వ్యూలకు హాజరైన వారిలో నకిలీ పత్రాలిచ్చిన వారిపై.. ఎంబసీ సహాయ ప్రాంతీయ భద్రత అధికారి కోరీ ఎం.థామస్‌ ఢిల్లీ చాణక్యపురి పోలీసుఠాణాలో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు, కన్సల్టెన్సీలు, సహకరించిన ఏజెంట్లపై కేసులు నమోదు చేసారు. ఈ క్రమంలో ఢిల్లీ పోలీసులు మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో దాడులు జరిపి పలువురిని అరెస్ట్‌ చేశారు.హైదరాబాద్‌కు చెందిన ఓ అభ్యర్థి నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ స్టూడెంట్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎర్రగడ్డలోని వెర్టెక్స్‌ నెట్‌కామ్‌ సొల్యూషన్స్‌లో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నట్లు వీసా ప్రాసెసింగ్‌ సమయంలో చెప్పాడు. అదే సంస్థ నుంచి ఇంటర్న్‌షిప్‌ లెటర్‌, మహారాష్ట్ర నాందేడ్‌లోని గోదావరి అర్బన్‌ మల్టీస్టేట్‌ క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంకు పాస్‌బుక్‌, గత మార్చి 30నాటికి ఆ ఖాతాలో రూ.24,17,110 నిల్వ ఉన్నట్లు చూపాడు. వరంగల్‌కు చెందిన మరో అభ్యర్థి 2017 సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకూ సాఫ్ట్‌టెక్‌ కంప్యూటర్స్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు వీసా దరఖాస్తులో పేర్కొన్నాడు. ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌ నుంచి రూ.25 లక్షల రుణం మంజూరైందని, తన ఖాతాలో రూ.25,02,500 నగదు ఉందని కూడా పేర్కొన్నాడు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హసన్‌పర్తికి చెందిన మరో అభ్యర్థి సాఫ్ట్‌టెక్‌ కంప్యూటర్స్‌లో పైథాన్‌ కోర్సు పూర్తిచేసినట్లు పేర్కొన్నాడు. కానీ, వీసా ఇంటర్వ్యూ సందర్భంగా వీరు సమర్పించిన పత్రాలు నకిలీవని అంగీకరించారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

David Warner-Pushpa: వారేవా..! మ్యాచ్ మధ్యలో పుష్ప సినిమా చూపించిన డేవిడ్ భాయ్.. తగ్గేదే లే..

Monkey Funny video: మొద‌టిసారి డ్రాగ‌న్ ఫ్రూట్ తిన్న పిల్లకోతి రియాక్షన్‌.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో

Viral Video: సంగీత్‌ ఫంక్షన్‌లో డాన్స్‌ అదరగొట్టిన నవ వధువు..! అదిరిపోయే స్టెప్పులకు కామెంట్లతో ఆశీర్వచనాలు

Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్‌ రివర్స్‌

kacha badam Singer: తత్వం బోధపడింది.. నేనేంటో తెలిసొచ్చింది.. కచ్చా బాదామ్‌ సింగర్‌ మాటలు వింటే షాక్…

Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..