kacha badam Singer: తత్వం బోధపడింది.. నేనేంటో తెలిసొచ్చింది.. కచ్చా బాదామ్‌ సింగర్‌ మాటలు వింటే షాక్…

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Apr 18, 2022 | 9:12 AM

ఒక్కసారిగా వచ్చిన ఫేమ్‌, డబ్బుతో గర్వం తలకెక్కిందని అంటున్నాడు కచ్చా బాదమ్‌ సింగర్‌ భూబన్‌ బద్యాకర్‌. అదే తన కొంప ముంచిందని వాపోయాడు. అయితే ఆ తర్వాత విమర్శలతో తత్వం బోధపడిందట. పేటెంట్‌ హక్కులు, రెమ్యునరేషన్‌ అంటూ వార్తల్లోకి ఎక్కాడు.


ఒక్కసారిగా వచ్చిన ఫేమ్‌, డబ్బుతో గర్వం తలకెక్కిందని అంటున్నాడు కచ్చా బాదమ్‌ సింగర్‌ భూబన్‌ బద్యాకర్‌. అదే తన కొంప ముంచిందని వాపోయాడు. అయితే ఆ తర్వాత విమర్శలతో తత్వం బోధపడిందట. పేటెంట్‌ హక్కులు, రెమ్యునరేషన్‌ అంటూ వార్తల్లోకి ఎక్కాడు. అటుపై కాస్త డబ్బు చేతిలో పడడంతో సాధారణ జీవనానికి బై చెప్పి.. పోష్‌ లుక్‌తో కొన్ని ఈవెంట్లలో కాస్త తలపొగరు ఆటిట్యూడ్‌తో కనిపించాడు. దీంతో భూబన్‌పై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ‘నేనొక సెలబ్రిటీని అనుకోవడం కంటే.. ఇప్పటికీ నేనొక పల్లీలు అమ్ముకునే వ్యక్తిగా అనుకోవడమే మంచిది. సడన్‌గా వచ్చిన పేరు, డబ్బు నన్ను పైకి తీసుకెళ్లాయి. నాశనం చేయాలని ప్రయత్నించాయి. ఆ రంగు, హంగులు చూసి నాకు గర్వం తలకెక్కింది. కానీ, ఇప్పుడు నేలకు దిగొచ్చా. వాస్తవమేంటో అర్థం చేసుకున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. సెకండ్‌ హ్యాండ్‌ కారు కొని.. యాక్సిడెంట్‌కు గురైన కచ్చా బాదమ్‌ సింగర్‌ భూబన్‌.. కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండి డిశ్చార్జి అయ్యాడు. ప్రస్తుతం రెండు పాటలు రికార్డింగ్‌ చేస్తున్నభూబన్‌.. సాధారణ జీవితం గడిపేందుకు రెడీ అంటున్నాడు.పశ్చిమ బెంగాల్‌ గ్రామంలో పల్లీలు అమ్ముకుంటూ తిరిగే భూబన్‌.. ఆ అమ్మే క్రమంలో పాటలు పాడుతూ ఇంటర్నెట్‌ ద్వారా ఫేమస్‌ అయ్యాడు. Kacha Badam రీమిక్స్‌తో అతని జీవితం మారిపోయింది.

మరిన్ని చూడండి ఇక్కడ:

Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..

Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్‌.. వైరల్ వీడియో

Shashi Tharoor-Supriya Sule: నిండు సభలో సుప్రియతో అదేం పని శశిథరూర్‌.! వీడియో చుస్తే ఫ్యూజులు ఔట్ అంతే..

Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..

Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu