Boris on Russia – Ukraine War: రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై సంచలన కామెంట్స్ చేసిన బ్రిటన్ ప్రధాని.. ఇంతకీ ఏమన్నారంటే..

Boris on Russia - Ukraine War: రష్యా - ఉక్రెయిన్ యుద్ధంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన కామెంట్స్ చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో

Boris on Russia - Ukraine War: రష్యా - ఉక్రెయిన్ యుద్ధంపై సంచలన కామెంట్స్ చేసిన బ్రిటన్ ప్రధాని.. ఇంతకీ ఏమన్నారంటే..
Britain Prime Minister
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 23, 2022 | 9:44 AM

Boris on Russia – Ukraine War: రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సంచలన కామెంట్స్ చేశారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటూ హాట్ కామెంట్స్ చేశారు బోరిస్‌ జాన్సన్‌. ఉక్రెయన్‌ యుద్ధం వచ్చే ఏడాది ఆఖరుదాకా వెళ్లవచ్చనీ, రష్యా గెలవచ్చన్న ఇంటెలెజెన్స్‌ వర్గాల అంచనాలపై బోరిస్‌ జాన్సన్‌ స్పందించారు. అది వాస్తవికమేనన్నారు. పుతిన్‌కున్న అపారమైన సైన్యాన్ని చూస్తే విజయం వాస్తవమేనని ఢిల్లీలో బోరిస్‌ జాన్సన్‌ వ్యాఖ్యానించారు. కీవ్‌లో తాము ఎంబసీ ఓపెన్‌ చేస్తామన్నారు.

భారీగా నిధులు కావాలి.. ఇక నెలకు 53,423 కోట్ల రూపాయలు కావాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు. యుద్ధంతో నాశనమైన ఉక్రెయిన్‌ను మళ్లీ నిర్మించుకోవాలంటే కనీసం నెలకు ఏడు బిలియన్‌ డాలర్ల చొప్పున నిధులు కావాలని ప్రపంచ బ్యాంక్‌ను కోరారు. యుద్ధం మొదలై రెండునెలల కావస్తున్న నేపథ్యంలో జెలెన్‌స్కీ తన దేశానికి కావాల్సిన సాయాన్ని కోరుతున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఇచ్చిన 500 మిలియన్‌ డాలర్ల మొత్తం తమకు సరిపోదని పరోక్షంగా చెప్పారు.

ఎటు చూసినా శవాల దిబ్బలే.. ఉక్రెయిన్‌లో ఎక్కడ చూసినా శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. కీవ్‌ ఓబ్లాస్ట్‌లో 1084 మృతదేహాలను గుర్తించారు. వీరిని రష్యా మిలటరీ హతమార్చిందని ఉక్రెయిన్‌ ఆరోపిస్తోంది. వీరిని తుపాకుల వంటి చిన్న ఆయుధాలతోనే చంపేసినట్లు అక్కడి పోలీసులు చెబుతున్నారు. బుచా, మరియుపోల్‌ తర్వాత కీవ్‌లో మృతదేహాలు కలకలం రేపుతున్నాయి.

ఉక్రెయిన్‌లోని మరియుపోల్‌లోగల అజోవ్‌స్థల్‌ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో రష్యా ఒక మెట్టు దిగినట్లే దిగి మెలికపెట్టింది. అక్కడి బంకర్లలో ఉన్న ప్రజలు సురక్షితంగా వెళ్లిపోవడానికి మానవతాసాయం చేస్తామని ముందుకు వచ్చింది. అయితే అందుకోసం ఉక్రెయిన్‌ సైనికులు లొంగిపోవాలని రష్యా రక్షణమంత్రిత్వశాఖ షరతులు విధించింది. దీంతో అక్కడ ప్రతిష్టంభన కొనసాగుతోంది.

ఉక్రెయిన్‌ బలగాలు తిరగబడుతున్నాయి. సొంతదేశంలో నాటో మిత్రుల బలంపై ఆధారపడుతూ రష్యన్‌ ట్యాంకర్లను ధ్వంసం చేస్తున్నాయి. రష్యన్‌ దళాలు అపారమైన సైనిక, ఆయుధ సంపత్తితో తమదే పైచేయి అని చెప్పుకుంటుంటే, అందుకు భిన్నంగా పోరాడుతున్నాయి ఉక్రెయిన్‌ సేనలు. మరోవైపు తన క్యాలిబర్‌ ఏంటో రష్యా చాటుకుంది. నల్లసముద్రం నుంచి నిప్పులు చెరుగుతూ నింగిలోని దూసుకుపోయాయి క్యాలిబర్‌ మిసైళ్లు. నల్లసముద్రంలో మోహరించిన యుద్ధనౌకల నుంచి ఈ మిసైళ్లను రష్యా ప్రయోగించింది. యుక్రెయన్‌లోని టార్గెట్లను ఈ మిసైళ్లు ఢీకొట్టాయి.

చెక్ రిపబ్లిక్ సంచలన నిర్ణయం.. రష్యాను మరింత ఇబ్బంది పెట్టేలా చెక్‌ రిపబ్లిక్‌ ఒక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రేగ్‌లో వీధి పేరును మార్చేసింది. ఈ వీధికి- “ఉక్రెయిన్‌ హీరోస్‌” అని పేరు పెట్టింది. ఎందుకంటే ఇదే వీధిలో రష్యా రాయబార కార్యాలయం ఉంది. రష్యా ఎంబసీ తన చిరునామా రాసుకోవాలన్నా, ఉక్రెయిన్‌ హీరోస్‌ అనే వీధి పేరు రాసేవిధంగా చెక్‌ రిపబ్లిక్‌ తీసుకున్న నిర్ణయమిది.

Also read:

Andhra Pradesh: ఇలాంటి రేస్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే..!

AP News: ‘ఏ బావ కళ్లల్లో ఆనందం కోసం చేశారు’.. ఎవరినీ వదిలిపెట్టను.. ఏబీవీ సీరియస్ వార్నింగ్..

Amit Shah Gun: టార్గెట్‌ ఫిక్స్‌ చేసిన షా.. మెషీన్ గన్ పట్టుకుని రచ్చ చేసేశారు..!