Amit Shah Gun: టార్గెట్ ఫిక్స్ చేసిన షా.. మెషీన్ గన్ పట్టుకుని రచ్చ చేసేశారు..!
Amit Shah Gun: ఎప్పుడూ కామ్‌గా సైలెంట్‌గా కనిపించే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. మెషీన్ గన్ పట్టుకుని అందర్నీ షాక్‌కు గురి చేశారు.
Amit Shah Gun: ఎప్పుడూ కామ్‌గా సైలెంట్‌గా కనిపించే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. మెషీన్ గన్ పట్టుకుని అందర్నీ షాక్‌కు గురి చేశారు. అవును మీరు విన్నది నిజమే.. గన్ చేతబట్టి, టార్గెట్‌ను గురిపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అత్యాధునిక మెషీన్ గన్‌ను చేతిలోకి తీసుకున్న ఆయన అంతటితోనే ఆగకుండా దానితో లక్ష్యానికి గురి పెట్టేశారు షా. నిజానికి అమిత్ షా కదన రంగంలోకి ఏమీ దూకలేదు గానీ.. కదన రంగంలోకి దిగే మన ఖాకీల కోసం రూపొందిస్తున్న అత్యాధునిక ఆయుధాలను పరిశీలించారు. మధ్యప్రదేశ్ రాజదాని భోపాల్‌కు సమీపంలోని సెంట్రల్ అకాడెమీ ఫర్ పోలిస్ ట్రైనింగ్‌ని సందర్శించిన సందర్భంగా పోలీసుల కోసం రూపొందించిన అత్యాధునిక ఆయుధాలను పరిశీలించారు.
ఇదే సమయంలో పోలీసు యంత్రాంగానికి కీలక సూచనలు చేశారు అమిత్ షా. పోలీసు బలగాలను ఆధునీకరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. నేరస్థుల కంటే రెండడుగులు ముందుండాలంటే టెక్నాలజిని బాగా వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేసేందుకు పోలీసు బలగాలను ఆధునీకరించి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని షా పేర్కొన్నారు. గత ఎనిమిదేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కాశ్మీర్ సమస్యను దాదాపుగా పరిష్కరించిందని, ఈశాన్య ప్రాంతంలో నక్సలిజం, డ్రగ్స్ సమస్యను కూడా పరిష్కరించిందని మంత్రి చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోందని ఆయన అన్నారు.
Also read:
Animal: నయా సినిమాను షురూ చేసిన సందీప్ రెడ్డి వంగ.. హిమాలయాల్లో మొదలైన యానిమల్ షూటింగ్
Mahesh Babu: షూటింగ్ పూర్తి చేసుకున్న సర్కారు వారి పాట.. ఇక బాక్సాఫీస్ రికార్డుల వేటకు సిద్ధమంటూ..
Wonder Kid: 9 ఏళ్ల బాలుడు రికార్డుల వేట.. కళ్ళకు గంతలతో స్కేటింగ్.. మంత్రి రోజా ప్రశంసలు