DK Aruna – BJP: గద్వాల్ గడ్డపై డీకే అరుణ మాస్టర్ ప్లాన్ ఇదేనా?.. నెక్ట్స్ ఎన్నికల్లో ఏం జరుగుతోంది?..
DK Aruna - BJP: కమలదళం దృష్టిలో గద్వాల్ చాలా ముఖ్యమైన స్థానం. ఎందుకంటే, అక్కడ కాంగ్రెస్ నుంచి వచ్చిన సీనియర్ నేత డీకే అరుణ ఉన్నారు.
DK Aruna – BJP: కమలదళం దృష్టిలో గద్వాల్ చాలా ముఖ్యమైన స్థానం. ఎందుకంటే, అక్కడ కాంగ్రెస్ నుంచి వచ్చిన సీనియర్ నేత డీకే అరుణ ఉన్నారు. దీంతో, మొన్నటి దాకా కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్‌గా ఉన్నసీన్.. ఇప్పుడు కారు వర్సెస్ కమలంలా మారింది. అయితే, మొన్నటి దాకా అరుణ పోటీ చెయ్యరనీ.. వారసురాల్ని బరిలో దింపుతారనీ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ప్లాన్ మార్చారట. ఇంతకీ ఏం జరిగింది? ఏం జరగబోతోంది? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
తెలంగాణలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి.. ఇతర పార్టీ నేతల చేరికతో పలు స్థానాల్లో పట్టు దొరికినట్టయ్యింది. అలాంటి స్థానాల్లో జోగాలాంబ జిల్లాలోని గద్వాల్ నియోజకవర్గం కీలకమైంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన డికే అరుణ.. ఇక్కడ బీజేపీకి బలంగా మారడంతో.. పొలిటికల్ సీన్ టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలో పత్తాలేని బీజేపీకి.. అరుణ చేరికతో బలమైన బేస్ దొరికిందని చెప్పొచ్చు. నడిగడ్డ ప్రాంతంలో జాడలేని కమలం.. ఇప్పుడు బహిరంగ సభలు నిర్వహించుకునే స్థాయికి ఎదిగింది.
గద్వాల్ అడ్డా చేసుకుని రాజకీయం చేస్తున్న డికే అరుణ.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేసినా.. రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. ప్రస్తుతం పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా, కర్నాటక రాష్ట్ర బీజేపీ సహఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. అటు ఢిల్లీ, ఇటు కర్నాటక, మధ్యమధ్యలో హైద్రాబాద్.. ఇలా వరుస కార్యక్రమాలతో బీజీగా ఉన్న అరుణ.. నియోజకవర్గంపై పెద్దగా పోకస్ పెట్టలేదు. క్యాడర్‌కు అందుబాటులో ఉండడానికి వీలు కాకపోవడంతో తన కూతురు స్నిగ్దరెడ్డికి కొన్నిభాద్యతలు అప్పగించారు. దీంతో, వచ్చే ఎన్నికల్లో అరుణ ఇక్కడి నుండి పోటీ చేయబోవడం లేదనే ప్రచారం మొదలైంది. తన స్థానంలో.. వారసురాలిగా స్నిగ్ధను బరిలో దింపనున్నారన్న ప్రచారం జరిగింది. గద్వాల్‌లో బండి పాదయాత్ర సందర్భంగా.. బహిరంగ సభలో అన్నీ తానై స్నిగ్ధ వ్యవహరించడం కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చింది.
గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన అరుణ.. ఈసారి కూడా పార్లమెంటుకే పోటీ చేస్తారన్న ప్రచారమూ జరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూతురిని బరిలో నిలిపి.. 2024 పార్లమెంటు ఎలక్షన్స్‌లో తాను పోటీ చేయాలని అరుణ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఒక కుటుంబంలో ఇద్దరికి సీట్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధాంతం ఒప్పుకొంటుందా? అనేది తెలియాల్సి ఉంది. హైకమాండ్ ఓకే అంటే.. ఈ ప్లాన్ పక్కా అనేది పార్టీ వర్గాల టాక్.
ఓడిన చోటే గెలవాలని అరుణ అనుకుంటున్నారా? అరుణ వర్గం మాత్రం.. అలాంటి చర్చేమీ లేదని.. రానున్న ఎన్నికల్లో మేడం కచ్చితంగా గద్వాల్ నుంచే పోటీ చేస్తారని చెబుతోంది. ఎక్కడ ఓడిపోయారో.. అక్కడే గెలిచి చూపించాలని అరుణ భావిస్తున్నట్టు ముఖ్య అనుచరులు చెబుతున్నారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు పోటీచేస్తోరో క్లారిటీ లేనప్పటికీ.. అరుణ మాత్రం గద్వాల్ అసెంబ్లికే పోటి చేస్తారని కరాఖండీగా చెబుతున్నారు. మరి ఎన్నికల నాటికి సీన్ ఎలా మారుతుందో? తల్లీ కూతుళ్లలో ఎవరు ఎక్కణ్నుంచి పోటీ చేస్తారో? చూడాలి.
Also read:
Andhra Pradesh: 20 రోజులవుతోంది.. ఆ ఫైర్ బ్రాండ్ ఎక్కడ?.. గుడివాడలో జోరుగా సాగుతున్న చర్చ..!
PK – Congress: కాంగ్రెస్ కోసం పీక్స్‌లో పీకే వ్యూహాలు.. ఆ నివేదిక లీక్స్ అందుకోసమేనా..!