Andhra Pradesh: 20 రోజులవుతోంది.. ఆ ఫైర్ బ్రాండ్ ఎక్కడ?.. గుడివాడలో జోరుగా సాగుతున్న చర్చ..!
Andhra Pradesh: కొడాలికి కోపమొచ్చిందా? అదేంటి.. చూడ్డానికి ఆయనెప్పుడూ గుస్సామీదున్నట్టే కనిపిస్తారుగా..? కొత్త కోపమేంటి అనుకుంటున్నారా? లేదండీ..
Andhra Pradesh: కొడాలికి కోపమొచ్చిందా? అదేంటి.. చూడ్డానికి ఆయనెప్పుడూ గుస్సామీదున్నట్టే కనిపిస్తారుగా..? కొత్త కోపమేంటి అనుకుంటున్నారా? లేదండీ.. దీనికి వేరే కారణం ఉందట? 20రోజులుగా గుడివాడలో అడుగుపెట్టలేదట.. ఇంతకీ రీజన్ ఏంటో?
వారం కాదు… పక్షం కాదు.. ఏకంగా 20 రోజులైంది కొడాలి నాని గుడివాడకొచ్చి. సొంత నియోజకవర్గానికి ఆయనెందుకు రావట్లేదు? ఇంతకీ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో ఇదే చర్చ జరుగుతోంది. మొన్నటివరకూ ఏపీ కేబినెట్‌లో ఓ వెలుగువెలిగిన కొడాలి నాని.. ఇప్పుడు మాజీ అయ్యారు. అప్పట్నుంచి, అస్సలు లోకల్ జనాలకు కనిపించనే లేదు.
ప్రత్యర్థులపై ఇంతెత్తున విరుచుకుపడే కొడాలి వాయిస్ ఎందుకు తగ్గింది. 20 రోజులుగా ఆయన ఎక్కడున్నారు…? గుడివాడంతా ఇప్పుడివే గుసగుసలు. కేబినెట్ రాజీనామా, కొత్తమంత్రి వర్గ కూర్పు కంటే ముందు నుంచే.. ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉండటంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఏప్రిల్ 1 నుంచి గుడివాడ జనాలకు కనీసం మొహం కూడా చూపించలేదట నాని. సాధారణంగా కుటుంబం హైదరాబాద్‌లో ఉండటంతో వారంలో రెండమూడు రోజులు అక్కడే ఉండేవారు, కానీ ఇన్ని రోజులు నియోజకవర్గానికి దూరంగా ఉండటంతో.. ఆయనకేమైంది? అనే చర్చ జోరందుకుంది.
ఈ నెల 7న జరిగిన కేబినేట్ భేటీ తర్వాత .. అందరితో పాటు మంత్రి పదవికి రాజీనామా చేశారు నాని. ఆ మీటింగ్ కు కూడా నేరుగా హైదరాబాద్ నుంచే అమరావతికి వచ్చారు. అట్నుంచటే హైదరాబాద్ వెళ్లిపోయారు. 11 న జరిగిన మంత్రివర్గ విస్తరణకూ అలాగే చేశారు. దీంతో, కొడాలి తీరు చర్చనీయాంశమైంది. మంత్రి పదవి పోవడంతో పెద్దగా పనిలేదనే … హైదరాబాద్‌కు పరిమితమయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కేబినెట్ నుంచి తప్పించారన్న కోపం కూడా ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పదవి ఉన్నా… లేకున్నా ఎమ్మెల్యే గా ప్రజలకు అందుబాటులో ఉండాలి కదా. సీఎం జగన్ సైతం ప్రతిరోజూ ప్రజల్లో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. అయినా కొడాలి నాని హైదరాబాద్ కి పరిమితం అవ్వడమేంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీని వెనక వేరే కారణాలేమైనా ఉన్నాయా? అనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. తన మాటలతో సంచలనం సృష్టించే కొడాలి.. నియోజకవర్గ ప్రజలకు ఎందుకిలా దూరంగా ఉంటున్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు.
Also read:
PK – Congress: కాంగ్రెస్ కోసం పీక్స్‌లో పీకే వ్యూహాలు.. ఆ నివేదిక లీక్స్ అందుకోసమేనా..!
Andhra Pradesh: ఇలాంటి రేస్ నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. వీడియో చూస్తే మతిపోవాల్సిందే..!