Pawan Kalyan: పవన్ పశ్చిమ టూర్‌లో జై జగన్ అంటూ నినాదాలు.. నోరు జారి నాలుక కరుచుకున్న ఫ్యాన్స్
Pawan Kalyan: ఏపీలో (Andhra Pradesh) కౌలు రైతులకు అండగా జనసేన (Janaena) అధినేత నేడు ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాలో(West Godavri District) పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పవన్ ఫ్యాన్స్, కార్యకర్తల ..
Pawan Kalyan: ఏపీలో (Andhra Pradesh) కౌలు రైతులకు అండగా జనసేన (Janaena) అధినేత నేడు ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాలో(West Godavri District) పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పవన్ ఫ్యాన్స్, కార్యకర్తల అత్యుహంతో వింత సంఘటన చోటు చేసుకుంది. జనసేనాని పవన్ కల్యాణ్ టూర్‌లో జై జగన్ నినాదాలు వినిపించాయి. పవన్‌కు ఘన స్వాగతం పలుకుతూనే జై జగన్ అంటూ నినాదాలు చేశారు ఫ్యాన్స్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల పరామర్శకు వెళ్లారు పవన్. హనుమాన్ జంక్షన్ వేలేరు అడ్డరోడ్డు బైపాస్ దగ్గర ఆయనకి పూలతో స్వాగతం పలికారు జనసైనికులు. అధినేతను చూసిన ఆనందం పట్టలేకో, లేదంటే ఇంకేంటో కానీ జై జగన్ అంటూ నినాదాలు చేశారు.
ఏలూరు బైపాస్ మీదుగా విజయరాయి, పెదవేగి, ధర్మాజీగూడెం, లింగపాలెంకు.. అక్కడి నుంచి ధర్మాజీగూడెం మీదుగా చింతలపూడికి చేరుకోనున్నారు. పవన్ కళ్యాణ్ చింతలపూడి లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కౌలు రైతుల కుటుంబాలను కలుసుకుని ఒక్కో కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. 41 మంది రైతులకు ఒకొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్ లు అందించనున్నారు.
Also Read: S Janaki Birthday: ఐదుతరాల హీరోయిన్లకు ఆలంబన జానకమ్మ స్వరం.. గానకోకిల పుట్టిన రోజు నేడు..