AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Errabelli Dayakar Rao: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రి

Road Accident in HYD-WGL Highway: హైదారాబాద్ - వరంగల్ రహదారిలో యాదాద్రి జిల్లా బీబీ నగర్ టోల్‌గేట్‌ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.

Errabelli Dayakar Rao: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రి
Road Accident
Shaik Madar Saheb
|

Updated on: Apr 23, 2022 | 11:51 AM

Share

Road Accident in HYD-WGL Highway: హైదారాబాద్ – వరంగల్ రహదారిలో యాదాద్రి జిల్లా బీబీ నగర్ టోల్‌గేట్‌ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఆగి ఉన్న లారీని ఆటో ట్రాలీ ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్ సహా డ్రైవర్ పక్క సీట్‌లో ఉన్న మరో వ్యక్తి మృతి చెందారు. మృతిచెందిన వారిని వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం తోటపల్లికి చెందిన అనిల్, వరంగల్‌కు చెందిన ఖలీల్‌గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ గుడిమల్కాపూర్‌లో ఫ్లవర్ మార్కెట్ నుంచి పూలు తీసుకొని తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో వరంగల్‌కు వెళ్తున్నారు. ఈ సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. ఈ ప్రమాదంపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తంచేశారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పలు కార్యక్రమాలకు హాజరు కావడానికి అదే మార్గంలో వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి.. ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. అనంతరం తన కాన్వాయ్‌ను ఘటనాస్థలంలో కాసేపు ఆపించారు. వెంటనే అక్కడికి పోలీస్ అధికారులను పిలిపించి.. దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

Jammu Terror Attack: సుంజ్వాన్‌లోని CISF జవాన్ల బస్సుపై ఉగ్రవాద దాడి.. వీడియో విడుదల చేసిన అధికారులు

Vijayawada: కొన్న ఒక్కరోజులోనే ప్రాణం తీసింది.. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి వ్యక్తి మృతి.. మరో ముగ్గురు