AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Swapping Policy: ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుదారులకు కేంద్ర సర్కార్‌ శుభవార్త.. ఏంటంటే..!

Swapping Policy: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు కూడా అందుబాటులోకి..

Swapping Policy: ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుదారులకు కేంద్ర సర్కార్‌ శుభవార్త.. ఏంటంటే..!
Subhash Goud
|

Updated on: Apr 22, 2022 | 2:20 PM

Share

Swapping Policy: ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ఎలక్ట్రిక్‌ వాహనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆయా కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. చాలా వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలను (Electric Vehicles)మార్కెట్లోకి తీసుకువస్తుండటంతో చార్జింగ్‌ పాయింట్లు కూడా ఏర్పాటు అవుతున్నాయి. అయితే చాలా మంది వాహనదారుల్లో ఓ సందేహం వ్యక్తం అవుతోంది. బ్యాటరీ సమస్యల వస్తే కొత్త బ్యాటరీ మార్చుకోవడం ఎలా అనేది. దీనికి కూడా పరిష్కారం లభించనుంది. ఇక ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేసేవారికి కేంద్రం గుడ్‌న్యూస్‌ తెలిపింది. తాజాగా కొత్త డ్రాఫ్ట్‌ నిబంధనలను జారీ చేసింది. నీతి ఆయోగ్‌ బ్యాటరీ స్వాపింగ్‌ పాలసీని విడుదల చేసింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా బ్యాటరీ స్వాపింగ్‌ (Battery Swapping) నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయనున్నారు. అయితే తొలి విడతలో 40 లక్షలకుపైగా జనాభా ఉన్న మెట్రో నగరాల్లో ఈ బ్యాటరీ స్వాపింగ్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఈ స్వాపింగ్‌ స్టేషన్ల ఏర్పాటు వల్ల ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనుగోలు చేసేవారికి ఊరట కలుగనుంది. తర్వాత దశలో 5 లక్షలు లేదా అపై జనాభా కలిగిన అన్ని పట్టణాలలో ఈ సదుపాయం అందుబాటులో తీసుకురానున్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాలకు సులభంగా బ్యాటరీ మార్పిడి చేసుకోవచ్చు. అలాగే బ్యాటరీ స్వాపింగ్‌ పాలసీ కింద విక్రయించే వాహణాలకు బ్యాటరీ ఉండదు. దీని కారణంగా వాహనం ధర కూడా తగ్గే అవకాశం ఉంది. బ్యాటరీ స్వాపింగ్‌ నెట్‌వర్క్‌ వద్దకు వెళ్లి బ్యాటరీ పొందవచ్చు. తర్వాత అక్కడే బ్యాటరీని మార్చుకోవచ్చు.

బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్లు ఎవరు ఏర్పాటు చేసుకోవచ్చు

డ్రాఫ్ట్‌ పాలసీ ప్రకారం.. వ్యక్తులు లేదా కంపెనీలు బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఏ ప్రాంతంలో అయినా ఈ స్టేషన్లను ఏర్పాటు చేసుకోవచ్చు. బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవాలంటే కేంద్ర విధించిన నిబంధనలు తప్పకుండా పాటించాలి. మెట్రో నగరాల్లో ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయడం కొంత ఇబ్బంది కావచ్చు. ఎందుకంటే అక్కడ స్థలం లభించకపోవడం, ఇతర కారణాలు ఉండవచ్చు. అందుకే బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్లను అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ 2022-23 బడ్జెట్‌ సమావేశాల్లో ప్రకటించారు.

డ్రాఫ్ట్‌ పాలసీపై మంత్రిత్వ శాఖలో చర్చలు:

కాగా,నీతి ఆయోగ్‌ వివిధ మంత్రిత్వ శాఖలో చర్చలు జరిపి ఈ డ్రాఫ్ట్‌ పాలసీ విధానాన్ని తీసుకువస్తోంది. ఈ పాలసీపై ఏదైనా సందేహాలు, సూచనలు, సలహాలు ఉంటే జూన్‌ 5వ తేదీ లోపు తెలియజేయవచ్చు. అయితే ప్రతి బ్యాటరీకి ఒక ప్రత్యేకమైన నంబర్‌ కలిగి ఉంటుంది. దీని ద్వారా ద్వారా బ్యాటరీని గుర్తిస్తారు. అలాగే ఏర్పాటుచేసే స్వాపింగ్‌ ఓ ప్రత్యేక నంబర్‌ను జారీ చేస్తారు. UIN నంబర్‌ ద్వారా బ్యాటరీ మార్పిడి చేసుకోవచ్చు.

బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, స్వాపింగ్ స్టేషన్లకు డేటా షేరింగ్ రూల్

అలాగే బ్యాటరీ మ్యానుఫాక్చరింగ్‌, స్వాపింగ్‌ స్టేషన్‌ల డేటా షేరింగ్‌ వంటి రూల్స్‌ తీసుకువస్తారు. అలాగే కామన్‌ స్టాండర్డ్స్‌ అమలు చేస్తారు. దీని వల్ల ఏ ప్రాంతంలోనైనా ఒకే రకమైన సేవలు ఉంటాయి. అందులో ఎలాంటి నకిలీ ఉండదు. మోసం ఉండకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే వాహనాదారులకు మంచి ప్రయోజనమనే చెప్పాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి:

Smartphone Overheating: వేసవిలో మీ స్మార్ట్‌ఫోన్‌ వేడెక్కుతోందా..? ఈ చిట్కాలను వాడండి..!

Scientific Reason: పిల్లలు రెండు తలలు, మూడు చేతులు, 6 వేళ్లతో పుట్టడానికి కారణం ఏమిటి! శాస్త్రీయ కారణాలు ఏమిటి?