Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్.. 12రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
Today Horoscope (December 26, 2024): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వృషభ రాశి వారు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. . మిథున రాశి వారికి అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (డిసెంబర్ 26, 2024): మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు చాలావరకు సవ్యంగా సాగిపోతాయి. వృషభ రాశి వారు ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా ఫలించే అవకాశం ఉంది. మిథున రాశి వారికి అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయం అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు సవ్యంగా సాగిపోతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు కూడా మీద పడతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా ఫలించే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. ముఖ్య మైన వ్యవహారాలు సకాలంలో పూర్తయి ఊరట లభిస్తుంది. కొందరు బంధుమిత్రులు సహాయంగా ఉంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ సలహాలు, సూచనల వల్ల అధికారులు లబ్ది పొందుతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇతరులకు మేలు జరిగే పనులు తలపెడతారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో రాబడి వృద్ధి చెందుతుంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. కొందరు సన్నిహితుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఉద్యోగంలో అధికారుల పోత్సాహం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు నిలకడగా కొనసా గుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు సవ్యంగా పూర్త వు తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే బాగా మెరుగుపడుతుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమవుతుంది. కుటుంబ జీవితం సాఫీగా, సంతోషంగా సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆర్థిక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టపోతారు. ఆస్తి వివాదానికి సంబంధించి శుభ పరిణామం చోటుచేసుకుంటుంది. గృహ ప్రయత్నం సానుకూలపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆదాయం ఆశించినంతగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో అధికారులు కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అధికారులకు మీ మీద అధికారులకు నమ్మకం ఏర్పడుతుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. మాటకు విలువ పెరుగుతుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపో తుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆర్థిక వ్యవహారాల్లో ప్రాణ స్నేహితులను సైతం గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. తలపెట్టిన పనులు, వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయానికి లోటుండకపోవచ్చు. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభి స్తుంది. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని లబ్ధి పొందుతారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు బాగా లాభి స్తాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. ఆస్తి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సవ్యంగా పూర్తవు తాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆస్తి వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో బంధువులను దూరంగా పెట్టడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయవద్దు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా శుభవార్తలు వింటారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ప్రస్తుతం సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అన్ని విషయాల్లోనూ అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తల పెట్టినా విజయవంతం అవుతుంది. కొందరు బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆదాయ ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతాయి.