Sun Transit: రవి గ్రహ అనుగ్రహం.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
అధికారానికి, తండ్రికి, ప్రభుత్వానికి, రాజకీయాలకు సూర్యుడు కారకుడు. ప్రస్తుతం సూర్యుడు మిత్ర క్షేత్రమైన ధనూ రాశిలో ప్రవేశించడం వల్ల వీటికి అత్యంత బలం లభిస్తుంది. సూర్యుడు ధనూ రాశి ప్రవేశం కారణంగా, ఆ రాశి అధిపతి గురువు కూడా అనుకూలంగా మారే అవకాశం ఉండంతో కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారంగా మారే అవకాశం ఉంది.
ప్రస్తుతం ధనూ రాశిలో సంచరిస్తున్న రవి గ్రహం అత్యంత శక్తిమంతుడుగా మారడం జరిగింది. మిత్ర క్షేత్రమైన ధనూ రాశిలో రవి గ్రహం ఒక ఉచ్ఛ గ్రహం మాదిరిగా వ్యవహరించడం జరుగుతుంది. రవి ధనూ రాశి ప్రవేశం కారణంగా, ఆ రాశి అధిపతి గురువు కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. అధికారానికి, తండ్రికి, ప్రభుత్వానికి, రాజకీయాలకు కారకుడైన రవి గ్రహం ధనూ రాశిలో ప్రవేశించడం వల్ల వీటికి అత్యంత బలం లభిస్తుంది. జనవరి 16 వరకు కొన్ని రాశులకు పట్టిందల్లా బంగారమయ్యే పరిస్థితి కలుగుతుంది. మేషం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు అనేక విషయాల్లో సాఫల్యాలు, విజయాలు సాధించే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి భాగ్య స్థానంలో రవి ప్రవేశం వల్ల రాజకీయాల్లో ప్రవేశించడానికి సమయం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్నవారు తప్పకుండా విజయాలు సాధిస్తారు. ఆదాయం పెరిగి సంపన్నుల జాబితాలో చేరిపోయే సూచనలు కూడా ఉన్నాయి. కొద్ది ప్రయత్నంతో అసా ధ్యాలు కూడా సాధ్యాలుగా మారుతాయి. నిరుద్యోగులకు అనేక ఆఫర్లు, అవకాశాలు అందడం జరుగుతుంది. వారసత్వసంపదలభిస్తుంది. విదేశీయానానికి ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి.
- కర్కాటకం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో రవి సంచారం వల్ల శత్రు, రుణ, రోగ బాధల నుంచి చాలావరకు బయటపడడం జరుగుతుంది. మీ సమర్థతను, శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారు. ఉద్యో గంలో ప్రాభవం పెరుగుతుంది. గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ప్రముఖులతో కలిసి మెలిసి తిరగడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఏ ప్రయత్నం చేపట్టినా విజయాలు సాధిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
- సింహం: రాశ్యధిపతి రవి పంచమ స్థానంలో సంచారం వల్ల రాజకీయాల్లో చేరడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నించడం మంచిది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. పిత్రార్జితం లభిస్తుంది. తండ్రి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. కొద్ది శ్రమతో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందు తుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి. సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు.
- తుల: ఈ రాశికి తృతీయ స్థానంలో రవి సంచారం వల్ల తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు కలుగుతాయి. కొద్ది ప్రయత్నంతో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు. రాజకీయాల్లో ప్రవేశించడానికి సమయం అనుకూలంగా ఉంది. ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. ప్రముఖులతో సంబం ధాలు వృద్ధి చెందుతాయి. తండ్రి వైపు నుంచి ధన లాభం, ఆస్తి లాభం కలుగుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది.
- ధనుస్సు: ఈ రాశిలో రవి సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. విదేశీ సంపాదనకు అవకాశాలు కలుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యో గాల్లో ఉన్నత పదవులు లభిస్తాయి. వ్యాపారాల్లో పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తి వివా దాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. గృహ లాభం కలుగుతుంది. తీర్థ యాత్రలు, విహార యాత్రలు ఎక్కువగా జరుగుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది.
- కుంభం: ఈ రాశికి లాభ స్థానంలో రవి గ్రహ సంచారం అనేక విధాలుగా ఆర్థిక లాభాలను కలిగిస్తుంది. జాతకంలోని అనేక దోషాలను పోగొడుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. రాజకీయాల్లో ఉన్న వారికి అధికార యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు కలుగు తాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో శుభ పరిణామాలు చోటు చేసు కుంటాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి కనక వర్షం కురిపిస్తాయి. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.