AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budha Gochar: 2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. మీరున్నారా చెక్ చేసుకోండి..

ధనుస్సు రాశికి అధిపతి దేవగురువు బృహస్పతి. ధనుస్సు రాశిలో సూర్యుడు, బుధుడు కలయిక జరగనుంది. దీంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలు కలవడంతో కొత్త సంవత్సరంలో కొన్ని రాశుల వారికి అదృష్టం సొంతం అవుతుంది. ఈ సమయంలో చాలా రాశుల వారు ధనవంతులు అవుతారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.

Budha Gochar: 2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే.. మీరున్నారా చెక్ చేసుకోండి..
Budha Gochar
Surya Kala
|

Updated on: Dec 25, 2024 | 7:25 AM

Share

జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడు అంటారు. మొత్తం 12 రాశులు బుధ గ్రహ సంచారం వలన ప్రభావితమవుతాయి. బుధుడు తన రాశిని 2025 సంవత్సరంలో అంటే కొత్త సంవత్సరంలో మార్చుకోబోతున్నాడు. బుధగ్రహం ఈ రాశి మార్పు కొత్త సంవత్సరం మొదటి వారంలోనే జరుగుతుంది. అంటే 2025 జనవరి 4న బుధుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు.

ధనుస్సు రాశికి అధిపతి బృహస్పతి. ధనుస్సు రాశిలో సూర్యుడు, బుధుడు కలయిక ఏర్పడనుంది. ఈ రెండు గ్రహాల కలయికతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలు కలయిక సంవత్సరంలోని మొదటి నెలలో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకుని రానున్నాడు. దీంతో కొన్ని రాశుల వారు ఆర్ధికంగా బలపడతారు. ధనవంతులు అవుతారు. ఈ రోజు ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..

మేష రాశి: మేష రాశి వారికి బుధుడు రాశిని మార్చుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. బుధుడు మేషరాశిలోని 9వ ఇంటిలో సంచరించనున్నాడు. ఈ సమయంలో మేష రాశి వారు తమ తండ్రి సహకారంతో గొప్ప విజయాలు సాధిస్తారు. ఈ కాలంలో మేష రాశి వారికి శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. ఆర్ధికంగా పెరుగుదల ఉంటుంది. కెరీర్‌లో కూడా విజయావకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక లాభం చేకూరే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: బుధుడు రాశిని మార్చుకున్న తరువాత బుధుడు మిథున రాశి వారికి ఏడవ ఇంటిలో సంచరిస్తాడు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ కారణంగా.. మిథునరాశి వారు ఈ కాలంలో విశేష ఫలితాలను పొందనున్నారు. ఈ సమయంలో మిథున రాశి వారు ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలలో సీనియర్ల సహకారం లభిస్తుంది. వ్యాపార భాగస్వామ్యాల్లో తలెత్తే సమస్యలు ఈ కాలంలో ముగుస్తాయి.

సింహ రాశి: రాశి మార్పు తరువాత.. బుధుడు సింహరాశి వ్యక్తుల ఐదవ ఇంటిలో సంచరిస్తాడు. ఈ కాలంలో సింహ రాశికి చెందిన వ్యక్తుల కెరీర్‌లో కొత్త అవకాశాలు లభిస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందుతారు. ఈ సమయంలో జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఇతర కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా బలపడతాయి.

ధనుస్సు రాశి: బుధుడు తన రాశిని మార్చుకుని ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ధనుస్సు రాశిలోని లగ్న గృహంలో సంచరిస్తాడు. ఈ కాలంలో ధనుస్సు రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదృష్టం వీరి వెంటనే ఉంది. చేపట్టిన ప్రతి పనిలోనూ పూర్తి మద్దతును పొందుతారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఈ సమయంలో ధనుస్సు రాశి వ్యక్తులు వ్యాపారంలో, కుటుంబంలో మద్దతును పొందుతారు. ధనుస్సు రాశి వారు ఈ సమయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.