AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki Avatar: దుష్ట శిక్షణ కోసం కల్కి అవతారం సంబాల్ లోనే జరుగుతుందా.. పురాణ కథ ఏమిటంటే..

సంభాల్ లోని కార్తికేయ శివాలయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉందని పురాతన శాస్త్రవేత్తల సహా యుపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. కల్కి అవతారంతో సంబంధం ఉందని అన్నారు సిఎం. వేదవ్యాసుడు శ్రీమద్ భగవత్ లో నారాయణుని 24 అవతారాలను ప్రస్తావించాడు. కలియుగం చివరలో దుష్టులను నాశనం చేయడానికి నారాయణుడు కల్కి రూపంలో సంభల్‌లో కనిపిస్తాడని చెప్పబడింది. హిందువుల అత్యంత పవిత్ర గ్రంథాలలో ఒకటైన శ్రీమద్ భగవత్.

Kalki Avatar: దుష్ట శిక్షణ కోసం కల్కి అవతారం సంబాల్ లోనే జరుగుతుందా.. పురాణ కథ ఏమిటంటే..
Kalaki Avatar
Surya Kala
|

Updated on: Dec 16, 2024 | 7:29 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో కల్కి అవతారంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై రాజకీయ వర్గాల్లో దుమారం చెలరేగింది. అయితే కొంతమంది యోగి ఆదిత్యనాథ్ చెప్పింది నిజమే కదా అందుకు సజీవ సాక్ష్యం పలు పురాణ కధలు అని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ చారిత్రక నగరం మాత్రమే కాదు.. ఈ నగరం ఆధ్యాత్మిక, పురాతన విశ్వాసాలను కూడా కలిగి ఉంది. ఈ నగరం గురించిన చర్చ ఐదున్నర వేల సంవత్సరాల క్రితం మహర్షి వేద వ్యాసుడు రచించిన శ్రీమద్ భగవత పురాణంలో కూడా ఉంది. శ్రీమద్ భగవత పురాణంలోని 12వ ఖండంలోని రెండవ అధ్యాయంలో నారాయణుడు 24వ అవతారమైన కల్కి సంభాల్ లో అవతరిస్తారని మహర్షి వేదవ్యాసుడు చెప్పారు.

కలియుగంలో దుష్టుల నాశనానికి ఈ అవతారం ఉండబోతోందని రాశారు. కేలా దేవి ఆలయానికి చెందిన మహంత్ రిషిరాజ్ గిరి కూడా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వాదనలకు మద్దతు ఇస్తూ శ్రీకృష్ణుడు రుక్మణితో కలిసి సంభాల్ మీదుగా వెళ్ళిన శ్రీమద్ భగవత్ కథను గుర్తు చేశారు. ఈ సందర్భంగా మహంత్ రిషిరాజ్ గిరి మాట్లాడుతూ కలియుగంలో ఈ ప్రదేశంలో శ్రీ మహా విష్ణువు కల్కి గా అవతరించబోతున్నాడని చెప్పారు. ఈ విషయం శ్రీమద్ భగవత్‌లో సంభాల్ నగరం గురించిన వివరణాత్మక వర్ణన ఉంది. అందులో ఈ నగరంలో 68 తీర్థయాత్రలు, 19 బావులు, 36 పురాలు, 52 సత్రాలను కలిగి ఉన్నట్లు చెప్పారు. మహంత్ ఋషిరాజ్ గిరి చెప్పిన ప్రకారం చూస్తే సంభాల్ నగరంలో ఇప్పటికీ అవి చాలా ఉన్నాయి. ఈ నగరంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇది ఒక అందమైన నగరం.

సంభాల్ నగరం గురించి పురాణాలలో చర్చ

మహంత్ ఋషిరాజ్ గిరి చెప్పిన ప్రకారం కాలం మనుషులను తూకం వేస్తోందని, చరిత్ర పుటలను తెరుస్తోందని పురాణాలలో వివరించబడిందని తెలుస్తోంది. ఐదు శతాబ్దాలుగా మౌనంగా ఉన్న ఈ నగరం ఇప్పుడు హరి హర మహదేవ అంటూ తన ఉనికిని చాటుకుంటుందని చెప్పారు. అయితే ఈ అంశం కోర్టులో ఉందని.. కోర్టు నిర్ణయాన్ని సర్వత్రా ఆమోదించాలని అన్నారు. 88 వేల మంది మహర్షులకు శ్రీమద్ భగవత్ వృత్తాంతాన్ని వివరిస్తూ భగవంతుడు కల్కి అవతారమెత్తాడని పురాణాలలో చెప్పబడిన.. సంభల్ గురించి కూడా చర్చ జరగాలని సూచించారు. కలియుగం ముగిసే సమయానికి మనుషులు గాడిదల్లా తయారవుతారని. అప్పుడు మనుషులు ఒకరినొకరు చంపుకుని తినడం మొదలుపెడతారని అన్నారు మహంత్ ఋషిరాజ్ గిరి.

ఇవి కూడా చదవండి

శ్రావణ మాసం శుక్ల పక్షం పంచమి తిధి రోజున కల్కి అవతారం

ఈ సందర్భంలో శుక్రదేవుడు చెప్పిన కల్కి అవతార సమయం, స్థలాన్ని చెప్పారు. శ్రావణ మాస శుక్ల పక్ష పంచమి తిథి రోజున బృహస్పతి, సూర్యుడు, చంద్రుడు కలిసి పుష్య నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు.. శ్రీమన్నారాయణుడు సంభాల్ లో తన భార్య లక్ష్మీదేవితో సహా కల్కి రూపంలో అవతరిస్తాడని చెప్పారు. దేవదత్ అనే తెల్లని గుర్రాన్ని అధిరోహించి అధర్మాన్ని నాశనం చేస్తాడని, కల్కి రెండవ భార్య పేరు రమ అని చెప్పారు. కల్కికి జై, విజయ్, మేఘమల్, బలాహక్ అనే నలుగురు కుమారులు ఉంటారు. ఆ సమయంలో భగవంతుని పూజారులుగా మహర్షి యాజ్ఞవల్కుడు, పరశురాముడు గురువుగా ఉంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!