AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Deposits: బ్యాంకుల్లో మూలుగుతున్న 74,580 కోట్లు.. ఈ డబ్బులు ఎవరివి?

Bank Deposits: దేశంలోని చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో చాలా కాలంగా డబ్బులు పేరుకుపోయాయి. వాటిని ఎవరూ క్లెయిమ్ చేయడం లేదు. చాలా కుటుంబాలు, పెట్టుబడిదారులు తమ పూర్వీకులు లేదా పాత పెట్టుబడులు ఎక్కడ చిక్కుకున్నాయో ఇంకా తెలుసుకోలేదు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని..

Bank Deposits: బ్యాంకుల్లో మూలుగుతున్న 74,580 కోట్లు.. ఈ డబ్బులు ఎవరివి?
Unclaimed Money
Subhash Goud
|

Updated on: Mar 16, 2026 | 3:54 PM

Share

Bank Deposits: 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు నిర్వహించని (ఆపరేట్ చేయని) బ్యాంక్ ఖాతాలు లేదా మెచ్యూరిటీ తర్వాత క్లెయిమ్ చేయని డిపాజిట్లను ‘అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు’ అంటారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల ప్రకారం, ఈ నిధులు డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (DEA) ఫండ్‌కు బదిలీ అవుతాయి. యూడీజీఏఎం (UDGAM) పోర్టల్ లేదా సంబంధిత బ్యాంక్ శాఖ ద్వారా వీటిని క్లెయిమ్ చేయవచ్చు.

దేశంలోని చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో చాలా కాలంగా డబ్బులు పేరుకుపోయాయి. వాటిని ఎవరూ క్లెయిమ్ చేయడం లేదు. చాలా కుటుంబాలు, పెట్టుబడిదారులు తమ పూర్వీకులు లేదా పాత పెట్టుబడులు ఎక్కడ చిక్కుకున్నాయో ఇంకా తెలుసుకోలేదు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం కొంతకాలం క్రితం ఒక ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారం కింద ప్రభుత్వం లక్ష్యం ఏ కుటుంబానికి చెందిన అన్‌క్లైమ్డ్‌ డబ్బులను ఆయా కుటుంబాలకు చేర్చడం.

ఇది కూడా చదవండి: Bank Holidays: బ్యాంకుకు వెళ్తున్నారా? మీకో బిగ్‌ అలర్ట్‌.. 4 రోజులు బ్యాంకులు బంద్‌!

లోక్‌సభకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం, మార్చి 31, 2024 నాటికి బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్ల మొత్తం సుమారు రూ.60,610 కోట్లు. ఈ మొత్తం ఒక సంవత్సరంలోనే మార్చి 31, 2025 నాటికి సుమారు రూ.74,580 కోట్లకు పెరిగింది. అంటే కేవలం ఒక సంవత్సరంలోనే వేల కోట్ల రూపాయలు పెరిగాయి. అయితే అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులదే అత్యధిక వాటా ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనలు సరళీకరిస్తూ RBI చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వడం లేదు. అయితే నామినీల విషయంలో ఖాతాదారులకు అవగాహన కల్పించాలని ఆర్బీఐ బ్యాంకులకు సూచిస్తోంది.

ప్రభుత్వ రంగ బ్యాంకులలో అత్యధిక వాటా:

డేటా ప్రకారం, ఈ అన్‌క్లెయిమ్డ్ డబ్బులో ప్రభుత్వ రంగ బ్యాంకులు అత్యధిక వాటాను కలిగి ఉన్నాయి. వారి వాటా 2024లో సుమారు 74.47%, 2025లో 74.18%. అంటే క్లెయిమ్ చేయని నిధులలో ఎక్కువ భాగం ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్దే ఉన్నాయి.

ప్రభుత్వం మరియు RBI కొత్త చర్యలు:

క్లెయిమ్ చేయని డిపాజిట్లను వాటి నిజమైన యజమానులకు తిరిగి ఇచ్చేలా చూసుకోవడానికి అనేక కార్యక్రమాలు ప్రారంభించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరణించిన ఖాతాదారులకు పరిష్కార ప్రక్రియను సులభతరం చేయడానికి RBI సెప్టెంబర్ 2025లో కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అక్టోబర్ 2025 నుండి, RBI ఒక ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద క్లెయిమ్ చేయని డిపాజిట్లను విజయవంతంగా పరిష్కరించే బ్యాంకులు మొత్తంలో 5% నుండి 7.5% వరకు ప్రోత్సాహకాలను పొందుతాయి.

UDGAM పోర్టల్ ద్వారా..

బ్యాంకులలో అన్ క్లెయిమ్డ్ డబ్బును ప్రజలకు తిరిగి ఇచ్చే ప్రక్రియను సులభతరం చేయడానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా UDGAM పోర్టల్ ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా, ప్రజలు తమ లేదా కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న పాత ఖాతాలు, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ లలో చిక్కుకున్న డబ్బు గురించి సమాచారాన్ని పొందవచ్చు. పోర్టల్ లో నమోదు చేసుకున్న తర్వాత ఏదైనా అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ కనుక్కుంటే సంబంధిత బ్యాంకు లేదా సంస్థలో డాక్యుమెంట్లు సమర్పించి డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు.

నామినీ నియమాలలో కూడా మార్పులు:

భవిష్యత్తులో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సమస్యను తగ్గించడానికి, బ్యాంకింగ్ నిబంధనల (సవరణ) చట్టం 2025లో మార్పులు చేసింది. బ్యాంక్ ఖాతాలు ఇప్పుడు ఒకరికి బదులుగా నలుగురు నామినీలను అనుమతిస్తాయి. ఇది భవిష్యత్తులో క్లెయిమ్ చేయని డిపాజిట్ల సమస్యను తగ్గిస్తుంది.

ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిపోతున్న కోడిగుడ్డు ధర.. డజన్‌ ఎంతో తెలుసా?

ఇది కూడా చదవండి: Rythu Bharosa: మరికొన్ని రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు.. రైతు భరోసా పథకానికి ఇలా దరఖాస్తు చేసుకోండి!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నాలుగు గ్రహాల్లో మార్పు.. ఈ రాశుల జీవితంలో కొత్త వెలుగులు!
నాలుగు గ్రహాల్లో మార్పు.. ఈ రాశుల జీవితంలో కొత్త వెలుగులు!
యుద్ధం.. రైతులకు కష్టాలు తప్పేలా లేవు!
యుద్ధం.. రైతులకు కష్టాలు తప్పేలా లేవు!
ఉస్తాద్ అంచనాలు పెరిగిపోతున్నాయి.. పవన్ సినిమా అంటే ఆ మాత్రం..
ఉస్తాద్ అంచనాలు పెరిగిపోతున్నాయి.. పవన్ సినిమా అంటే ఆ మాత్రం..
అడక్కుండానే లిఫ్ట్ ఇచ్చాడు.. ఎంత మంచోడో అనుకునేరు.. కాసేపటికి..
అడక్కుండానే లిఫ్ట్ ఇచ్చాడు.. ఎంత మంచోడో అనుకునేరు.. కాసేపటికి..
వంట గ్యాస్‌పై కేంద్రం శుభవార్త.. ఎల్‌పీజీ సరఫరాపై కీలక ప్రకటన!
వంట గ్యాస్‌పై కేంద్రం శుభవార్త.. ఎల్‌పీజీ సరఫరాపై కీలక ప్రకటన!
పదోతరగతి పరీక్షలు రాసేందుకు ఈ దివ్యాంగురాలి కష్టాలు చూశారా? VIDEO
పదోతరగతి పరీక్షలు రాసేందుకు ఈ దివ్యాంగురాలి కష్టాలు చూశారా? VIDEO
ప్రయాణికులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఉగాది,రంజాన్‌కు ప్రత్యేక బస్సులు
ప్రయాణికులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఉగాది,రంజాన్‌కు ప్రత్యేక బస్సులు
రమణ మహర్షి ఆశ్రమంలో అద్భుతం కళ్లారా చూశా: నటుడు కృష్ణ భగవాన్
రమణ మహర్షి ఆశ్రమంలో అద్భుతం కళ్లారా చూశా: నటుడు కృష్ణ భగవాన్
బ్యాంకుల్లో మూలుగుతున్న 74,580 కోట్లు.. ఈ డబ్బులు ఎవరివి?
బ్యాంకుల్లో మూలుగుతున్న 74,580 కోట్లు.. ఈ డబ్బులు ఎవరివి?
గేల్ రికార్డు బద్ధలు కొడతా.. రాజస్థాన్ రాయల్స్ సంచలనం వార్నింగ్
గేల్ రికార్డు బద్ధలు కొడతా.. రాజస్థాన్ రాయల్స్ సంచలనం వార్నింగ్