మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఓ ఆయుర్వేద వైద్యుడు యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఆగ్రహించిన యువతి బంధువులు సదరు డాక్టర్ కిరణ్ కుమార్ పై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.