AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aravana Payasam: అయ్యప్ప ప్రసాదం అంటే ఇష్టమా.. ఇంట్లోనే అరవణ పాయసం తయారీ చేసుకోండి ఇలా.. రెసిపీ మీ కోసం..

హిందు దేవుళ్ళ పూజలో వివిధ నియమాలు ఉన్నాయి. పూజ, ధూపం, దీపం, నైవేద్యం వంటి అనేక విధానాలు ఉన్నాయి. అదే విధంగా హిందూ ప్రముఖ పుణ్యక్షేత్రాలు.. అక్కడ ఉన్న దేవతలకు సమర్పించే నైవేద్యాలు, భక్తులకు పంచే ప్రసాదం కూడా విశిష్టతను సొంతం చేసుకున్నాయి. లాంటి ప్రసాదాల్లో తిరుమల లడ్డు, శబరిమల అయ్యప్ప అరవణ పాయసం, అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ముందుగా గుర్తుకొస్తాయి. అయితే శబరిమల అయ్యప్ప స్వామి అరవణ పాయసం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ రోజు రెసిపీ తెలుసుకుందాం..

Aravana Payasam: అయ్యప్ప ప్రసాదం అంటే ఇష్టమా.. ఇంట్లోనే అరవణ పాయసం తయారీ చేసుకోండి ఇలా.. రెసిపీ మీ కోసం..
Kerala Aravana Payasam
Surya Kala
|

Updated on: Dec 16, 2024 | 5:02 PM

Share

హిందు దేవుళ్ళ పూజలో వివిధ నియమాలు ఉన్నాయి. పూజ, ధూపం, దీపం, నైవేద్యం వంటి అనేక విధానాలు ఉన్నాయి. అదే విధంగా హిందూ ప్రముఖ పుణ్యక్షేత్రాలు.. అక్కడ ఉన్న దేవతలకు సమర్పించే నైవేద్యాలు, భక్తులకు పంచే ప్రసాదం కూడా విశిష్టతను సొంతం చేసుకున్నాయి. లాంటి ప్రసాదాల్లో తిరుమల లడ్డు, శబరిమల అయ్యప్ప అరవణ పాయసం, అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ముందుగా గుర్తుకొస్తాయి. అయితే శబరిమల అయ్యప్ప స్వామి అరవణ పాయసం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ రోజు రెసిపీ తెలుసుకుందాం..

హరిహరసుతుడు అయ్యప్ప స్వామి కొలువైన శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. అయ్యప్ప దర్శనం చేసుకుని అక్కడ నుంచి తెచ్చే స్వామివారి అరవణ ప్రసాదం కోసం ఇంట్లోని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రసాదం వెరీ వెరీ స్పెషల్. అయితే భారీ సంఖ్యలో భక్తులు శబరిమలకు వెళ్తుండడంతో అరవణ ప్రసాదం కావలసినంత దొరకడం లేదు. దీంతో నచ్చిన స్వామివారి ప్రసాదం తినాలి కోరుకునేవారికీ నిరస ఎదురవుతుంది. అయితే అయ్యప్ప ప్రసాదంలా ఎంతో రుచిగా ఉండేలా కేరళ స్పెషల్ సాంప్రదాయ ప్రసిద్ధ అరవణ పాయసం తయారు చేయడం ఈ రోజు తెలుసుకుందాం..

అరవణ పాయసం తయారీకి కావాల్సిన పదార్ధాలు:

  1. ఎర్ర బియ్యం లేదా వెదురు బియ్యం- ఒక కప్పు
  2. తాటి బెల్లం పొడి – రెండున్నర కప్పులు
  3. ఇవి కూడా చదవండి
  4. నెయ్యి – ఒక కప్పు
  5. పచ్చి కొబ్బరి _ తరిగిన ముక్కలు
  6. జీడి పప్పులు – 15
  7. నీళ్లు – 7 కప్పు
  8. శొంఠి పొడి – 2 టీస్పూన్లు

తయారుచేసే విధానం: మందుగా ఒక దళసరి గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో ఒక కప్పు నీరు పోసి అందులో తాటి బెల్లం పొడి వేసి కరిగించాలి. ఇప్పుడు కరిగిన బెల్లంనీరుని ఒక పక్కకు పెట్టి.. ఒక పాన్ తీసుకుని అందులో నెయ్యి వేసి జీడిపప్పులు వేసి వేయించాలి. తర్వాత పచ్చికొబ్బరి ముక్కలు వేసి అవి బంగారు రంగులోకి వెచ్చే వరకూ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తీసుకున్న బియ్యాన్ని బాగా శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి ఆరుకప్పుల నీరు పోసి కొంచెం నెయ్యి వేసి బాగా ఉడికించండి. బియ్యం బాగా ఉడికిన తర్వాత కరిగిన బెల్లం నీరుని పోసి బాగా కలపాలి. తర్వాత నెయ్యి, శొంఠి పొడి, వేయించిన జీడిపప్పులు, కొబ్బరి ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొంచెం సేపు ఉడికించి స్టవ్ కట్టేసి పక్కకు పెట్టుకోవాలి. కొంచెం సేపటికి పాయసం గట్టిపడుతుంది. అంతే అయ్యప్ప అరవణ పాయసం రెడీ. ఇది గాలి తగలని సీసాలో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మూడు రోజులు నిల్వ ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..