AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sambhal: 300 ఏళ్ల నాటి సంభాల్‌ శివాలయం.. 46ఏళ్ళుగా ఎందుకు క్లోజ్ చేశారు? ఎంత స్థలం ఆక్రమణకు గురైందో తెలుసా..!

ప్రస్తుతం అందరి దృష్టి సంభాల్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన శివాలయం మీదనే ఉంది. ఈ ఆలయం 1978లో అల్లర్లు జరిగిన తర్వాత ముసి వేయబండింది. అంతకు ముందు ఈ ప్రాంతంలో 42 హిందూ కుటుంబాలు నివసించేవి. 1978లో అల్లర్లు జరిగిన తర్వాత హిందూ కుటుంబాలు క్రమంగా ఈ ప్రాంతం నుంచి వలస వెళ్ళిపోయాయి. తర్వాత ఆలయాన్ని ఆక్రమించి గుడి పైభాగంలో ఉన్న బాల్కనీలను ఆక్రమణదారులు తొలగించారు. ఆలయ ప్రదక్షిణ మార్గం కూడా ఆక్రమణకు గురైంది.

Sambhal: 300 ఏళ్ల నాటి సంభాల్‌ శివాలయం.. 46ఏళ్ళుగా ఎందుకు క్లోజ్ చేశారు? ఎంత స్థలం ఆక్రమణకు గురైందో తెలుసా..!
Sambhal Ancient Temple
Surya Kala
|

Updated on: Dec 16, 2024 | 6:06 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో 46 ఏళ్లుగా మూతపడిన శివాలయాన్ని అధికారులు తెరిచారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆలయ ఆక్రమణలపై సమాచారం అందుకున్న పరిపాలన బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పుడు ఈ పురాతన ఆలయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆలయాన్ని శుభ్రం చేశారు. ఆలయంలో శివలింగంతో పాటు హనుమాన్ విగ్రహం కూడా ఉంది. అంతేకాదు ఈ ఆలయ ప్రాంగణంలో ఒక పురాతన బావి కూడా ఉన్నట్లు పరిశోధనకారులు గుర్తించారు. అక్కడ జరిపిన తవ్వకంలో మరో మూడు విగ్రహాలు వెలుగులోకి వచ్చాయి.

సంభాల్‌లోని ఖగ్గు సరాయ్ ప్రాంతంలోని ఈ ఆలయన్ని కార్తీక శంకర ఆలయంగా గుర్తించారు. అంతేకాదు ఈ ఆలయం సుమారు 300 సంవత్సరాల నాటిదని చెబుతున్నారు. అప్పటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ 82 ఏళ్ల విష్ణు శరణ్ రస్తోగి ఈ ప్రాంతం గతంలో హిందువుల ఆధిపత్యంలో ఉండేదని.. ఈ కార్తీక శంకర ఆలయం హిందువుల విశ్వాసానికి కేంద్రంగా ఉందని చెప్పారు. అయితే 1978 అల్లర్ల తర్వాత హిందూ కుటుంబాలు ఈ ఆలయంలో పూజలు చేయడం మానివేశాయన్నారు.

హిందువులు ఎందుకు వలస వెళ్ళారంటే..

కొన్ని వంటల ఏళ్ల క్రితం పూర్వీకులు ఈ ఆలయాన్ని నిర్మించారని విష్ణు శరణ్ రస్తోగి (82 సంవత్సరాలు) చెప్పారు. ఈ ఆలయానికి దగ్గరలో ఒక రావి చెట్టు ఉంది. ఒక బావి కూడా ఉంది. ప్రజలు ఉదయం, సాయంత్రం ఆలయానికి వచ్చి దర్శనం చేసుకునేవారు. బావి దగ్గర దేవుడిని తలచుకుంటూ కీర్తనలు చేసేవారని చెప్పారు విష్ణు విష్ణు శరణ్. అయితే 1978లో ఈ ప్రాంతలో అల్లర్లు జరిగాయి. అప్పుడు హిందువులు భయంతో ప్రాణాలను అరచేతిట్లో పెట్టుకుని ఈ ప్రాంతం నుంచి పారిపోయారు. చుట్టుపక్కల ముస్లిం జనాభా ఉండడంతో భయంతో ఇక్కడ నుంచి వలస వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి

విష్ణు శరణ్ రస్తోగి ఈ ప్రాంతం గురించి ఇంకా అనేక విషయాలను పంచుకున్నారు. ఈ ప్రాంతంలో 40 నుంచి 42 హిందూ కుటుంబాలు నివసిస్తుండేవని.. సమీపంలోనే ముస్లిం కుటుంబాలు నివసిస్తూ ఉండేవారని చెప్పారు. అందరిలో సోదరభావం చాలా ఉండేది. ఆలయంలో అన్ని మత సంప్రదాయాలు జరిగాయని చెప్పారు. ఈ ప్రాంతంలోని తమ పూర్వీకులకు సంబంధించిన చివరి ఇల్లు 2005లో అమ్మివేసినట్లు తెలిపారు.

ఆలయం చుట్టూ 4 అడుగుల మేర ప్రదక్షిణ మార్గం ఉండేది.

విష్ణు శరణ్ ఈ ఆలయం గురించి ఇంకా అనే విషయాలను పంచుకున్నారు. ఈ ఆలయంలో పూజ చేయడానికి, హారతి ఇవ్వడానికి ఎవరూ మిగిలి లేరు. తమ ఇంటిని కూడా ముస్లిం కుటుంబానికి అమ్మేశామని చెప్పారు. అనంతరం స్థానికులు గుడి పైభాగంలో బాల్కనీలు తీశారు. ఆలయం చుట్టూ 4 అడుగుల ప్రదక్షిణ మార్గం ఉండేది. అయితే గుడి ముందు భాగం మినహా మూడు వైపులా ఆక్రమణకు గురైందని అన్నారు.

గుడి తాళం తమ కుటుంబం వద్దే ఉందని.. ఆ ఆలయ నిర్వహణ తమ కుటుంబానికే చెందింది. అయితే తాము ఆ గుడిని తెరవలేదు, పూజలు చేయలేదు. 40 ఏళ్ల క్రితమే గుడిలో పూజలు చేసేందుకు పూజారిని ఏర్పాటు చేశానని .. అయితే ఆ పూజారికి గుడికి వెళ్లే ధైర్యం చేయలేదు.. ముందు ఆ పుజారీ గుడిలో పూజ చేయడానికి రెండు మూడు రోజులు వెళ్ళాడు.. ఆ తర్వాత ఆ పుజారీ గుడికి వెళ్లి పూజ చేయడనికి నిరాకరించాడని చెప్పారు. ఆక్రమణదారులు బావిని మూసివేశారని, కారు పార్క్ చేసేందుకు దానిపై ర్యాంప్‌ను ఏర్పాటు చేశారని విష్ణు శరణ్ చెప్పారు. గుడి కోసం భూమి తమ కుటుంబం ఇచ్చిందని అన్నారు. ఈ గుడి సుమారు 300 సంవత్సరాల క్రితం నుంచి ఉందని.. కాలక్రమంలో ఈ ప్రాంతంలో హిందువులు తక్కువ అవడంలో ఆలయంలో పూజలు ఆగిపోయాయని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు