AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్..! నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది.. సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు చైతూ. రీసెంట్ గా తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మత్యకారుడిగా కనిపించాడు నాగ చైతన్య

అమ్మబాబోయ్..! నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది.. సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
Josh Movie
Rajeev Rayala
|

Updated on: Dec 05, 2025 | 9:03 PM

Share

అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన ‘జోష్’ మూవీ గుర్తుందా.? ఈ సినిమా ద్వారా అలనాటి తార రాధ కుమార్తె కార్తీక నాయర్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలి చిత్రంతోనే నటనకు గానూ మంచి మార్కులు కొట్టేసింది. అయితేనేం తెలుగులో ఈమెకు మాత్రం అదృష్టం అంతంతమాత్రమే అని చెప్పొచ్చు. తొలి చిత్రం హిట్ అయినప్పటికీ.. పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక తమిళంలో ‘కో’ అనే చిత్రంతో కోలివుడ్‌లో అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. అక్కడ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. అంతేకాకుండా ఈ సినిమా తెలుగులో ‘రంగం’ పేరుతో విడుదలై.. ఇక్కడా పెద్ద హిట్ సాధించింది. హీరోయిన్ కార్తీకకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే కుర్రాళ్ళ క్రష్ గా మారిపోయింది ఈ వయ్యారి భామ.

వెంకటేష్‌కు లవర్‌గా.. చిరంజీవికి అక్కగా నటించిన ఈహీరోయిన్ ఎవరో తెలుసా.?

అలాగే మలయాళం ఇండస్ట్రీకి ‘మకరమంజు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ వయ్యారి. ఈ మూవీ సక్సెస్ సాధించినా.. ఆ ఇండస్ట్రీలోనూ ఎక్కువ ఛాన్స్‌లు దక్కించుకోలేకపోయింది ఈ అందాల భామ. ఇక తెలుగులో ‘దమ్ము’, ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ సినిమాల్లో నటించింది. ఆతర్వాత సినిమాల్లో పిల్లగా నటించలేదు ఈ అమ్మడు.

అప్పుడు స్టార్ హీరోయిన్.. కట్ చేస్తే ఇప్పుడు సినిమాలు మానేసి స్కూల్‌కు వెళ్తుంది.

వెండితెరపై అచ్చిరాక.. బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది కార్తీక నాయర్. 2017లో ‘ఆరంభ్’ అనే హిందీ సీరియల్‌లో నటించింది. ఇక ఇందులో కార్తీక నటనకు క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందాయి. ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమైన ఈ భామ.. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి కేరళలో నివాసముంటోంది. అక్కడ యూడీఎస్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌కు డైరెక్టర్‌గా పని చేస్తోంది. అలాగే 2023, నవంబర్‌లో రోహిత్ మీనన్ అనే వ్యక్తిని పెళ్లాడింది కార్తీక నాయర్. కాగా పెళ్లి తర్వాత పూర్తిగా ఈ అమ్మడు సినిమాలకు దూరం అయ్యింది. కార్తీక చెల్లి కూడా హీరోయిన్ గా సినిమాలు చేసింది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అందాల భామ రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

సాయి పల్లవి ఫోన్ వల్ల నా జీవితం మారిపోయింది.. ఆమె సలహా ఎప్పటికీ మర్చిపోనూ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .