AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాయి పల్లవి ఫోన్ వల్ల నా జీవితం మారిపోయింది.. ఆమె సలహా ఎప్పటికీ మర్చిపోనూ..

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి చేతిలో ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. బాలీవుడ్ రామాయణ్ పార్ట్-1,2లతో పాటు ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ మూవీలోనూ నటిస్తోంది. అలాగే దక్షిణాదిలోనూ పలు సినిమాల్లో కథానాయికగా యాక్ట్ చేస్తోంది. అయితే ఇటీవల తన సినిమాల కంటే ఇతర విషయాలతో వార్తల్లో నిలుస్తోందీ అందాల తార.

సాయి పల్లవి ఫోన్ వల్ల నా జీవితం మారిపోయింది.. ఆమె సలహా ఎప్పటికీ మర్చిపోనూ..
Sai Pallavi
Rajeev Rayala
|

Updated on: Dec 04, 2025 | 6:06 PM

Share

లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది అందాల భామ సాయి పల్లవి. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది. నేచురల్ లుక్ తో ఆకట్టుకునే అభినయంతో ప్రేక్షకులను అలరించింది. తెలుగులోకి ఫిదా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోన్న సాయి పల్లవి ఇప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తోంది. రామాయణం సినిమాలో సీతగా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. సాయి పల్లవి చాలా సింపుల్ గా ఉంటుంది. ఎలాంటి లగ్జరీ ఫెసిలిటీలను సాయి పల్లవి కోరుకోదు. అందుకే దర్శక నిర్మాతలు ఎక్కువగా సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకుంటారు.

తాజాగా ఓ సంగీత దర్శకుడు సాయి పల్లవి కారణంగా తన లైఫ్ మారిపోయిందని చెప్పాడు. తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్ గా క్రేజ్ తెచ్చుకుంటున్నాడు సురేశ్‌ బొబ్బిలి. ఇటీవలే విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సురేష్. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన సాయి పల్లవి గురించి ఆసక్తికర విషయం తెలిపాడు.

శ్రీ విష్ణు హీరోగా నటించిన నీది నాది ఒకే కథ సినిమాతో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా మారాను. అయితే నా లైఫ్ ను పూర్తిగా మార్చేసిన సినిమా మాత్రం విరాటపర్వం. ఆ మూవీ సమయంలో నాకు తాగుడు అలవాటు ఉండేది. బాగా మద్యం సేవించేవాడిని.. అమ్మ, నాన్న లేరు.. అన్న ఉన్నా ఆయన మాటను ఎప్పుడూ వినేవాడిని కాదు.ప్రేమ , బ్రేకప్ కారణంగా ఫుల్లుగా మద్యం తాగేవాడిని.. అప్పుడు వేణు ఊడుగుల , సాయి పల్లవి ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేసేవాడిని కాదు. ఆతర్వాత మత్తు దిగిన తర్వాత ఎందుకు లిఫ్ట్ చేయలేదా అని ఏడ్చేవాడిని.. విరాటపర్వం సినిమా సమయంలో నేను ఫోన్లు ఎత్తకపోయేసరికి వేరేవాళ్లకు  బ్యాగ్రౌండ్ స్కోర్ ఇద్దామని అనుకున్నారు. అప్పటికే నేను బ్యాగ్రౌండ్ స్కోర్ కొంచం చేశాను. అది సాయి పల్లవి, రానాకు నచ్చింది. వాళ్లు నా మ్యూజిక్కే కావాలి అని అన్నారు. ఒక రోజు సాయిపల్లవి నాకు ఫోన్‌ చేసి.. మీకేదైనా నేనున్నాను. మీరు ఫోకస్ పెట్టి పని చేయండి. ఆరోగ్య సమస్య లేదా వ్యక్తిగత సమస్యలేమైనా ఉంటే నేను చూసుకుంటాను. మీరు మీ పని చేసుకోండి అని చెప్పారు. అలాగే సినిమా రిలీజయ్యాక ఫస్ట్‌ మీకే మంచి పేరొస్తుంది.. చాలా బాగా సంగీతం అందించారు. మీకు మంచి కెరీర్‌ ఉంది. వేణుగారు మీ గురించి నాకు కొన్ని విషయాలు చెప్పారు. వాటన్నింటిని వదిలేయండి.. మీకు మంచి భవిష్యత్తు ఉంది. చిన్నచిన్నవాటిని పట్టించుకోవద్దు అని సాయిపల్లవి అన్నారు. ఆమె ఫోన్ కాల్ తో నా జీవితమే మారిపోయింది. ఆమె సలహా వల్లే మద్యం మానేశాను. ఇంతవరకు మళ్లీ మందు జోలికి వెళ్లలే అని చెప్పుకొచ్చాడు సురేష్ బొబ్బిలి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.