Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wednesday Puja Tips: బుధవారం పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. లేదంటే జీవితంలో అన్నీ అడ్డంకులే

వారంలో బుధవారం ఆటంకాలను తొలగించే దైవం గణేశుడికి అంకితం చేయబడింది. ఈ రోజు బుధ గ్రహానికి సంబంధించిన రోజుగా కూడా పరిగణించబడుతుంది. హిందూ మత గ్రంథాలలో బుధవారం కొన్ని పనులు చేయడం నిషేధించినట్లు పేర్కొన్నాయి. కొని పనులు చేయడం వల్ల జీవితం పేదరికంతో నిండిపోతుంది. అంతే కాదు నిషేధిత పనులు చేయడం వల్ల జీవితంలో అనేక రకాల అడ్డంకులు వస్తాయి.

Wednesday Puja Tips: బుధవారం పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. లేదంటే జీవితంలో అన్నీ అడ్డంకులే
Wednesday Puja Tips
Follow us
Surya Kala

|

Updated on: Dec 10, 2024 | 5:53 PM

హిందూ మత గ్రంథాలలో బుధవారం గణేశుడి రోజుగా పరిగణించబడుతుంది. చేపట్టిన పనుల్లో అడ్డంకులను తొలగించే దైవంగా గణపతిని పూజిస్తారు. ఎవరైతే బుధవారం రోజున గణేశుడిని పూజిస్తారో వారి ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటాయి. పూజలే కాకుండా వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం బుధవారం రోజున కొన్ని చర్యలు చేయడం జీవితంలో సంతోషం కలుగుతుంది.

అదే సమయంలో హిందూ మత గ్రంథాలలో బుధవారం రోజున కొన్ని పనులు చేయకూడదు అనే ప్రస్తావన కూడా ఉంది. ఇలాంటి పనులు చేయడం వల్ల జీవితం పేదరికంతో నిండిపోతుంది. దీనితో పాటు జీవితంలో చేపట్టిన ప్రతి పనిలోనూ అనేక రకాల అడ్డంకులు రావడం ప్రారంభమవుతాయి. కనుక హిందూ మత గ్రంధాలలో బుధవారం రోజున చేయడం నిషిద్ధమని భావించే ఆ పనులు ఏమిటో తెలుసుకుందాం.

బుధవారం రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు

  1. బుధవారం గణపతి, బుధ గ్రహానికి అంకితం చేసిన రోజు. బుధుడు తెలివితేటలు, వాక్కు గ్రహంగా చెప్పబడింది. అందువల్ల బుధవారం ఎవరినీ దుర్భాషలాడవద్దు. ఈ రోజున మీరు మాటపై పూర్తి నియంత్రణ కలిగి ఉండండి.
  2. బుధవారం డబ్బుకు సంబంధించిన ఎలాంటి లావాదేవీలు చేయవద్దు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం నాడు రుణాలు ఇవ్వడం లేదా రుణం తీసుకునే వ్యక్తి ఆర్థిక సమస్యలను ఎదుర్కోవచ్చు. అందువల్ల బుధవారం రుణం ఇవ్వడం, డబ్బు తీసుకోవడం రెండింటినీ చేయవద్దు.
  3. ఇవి కూడా చదవండి
  4. బుధవారం పడమర దిశలో ప్రయాణించడం మానుకోండి. బుధవారం పడమర దిశలో ప్రయాణించడం అశుభం. అయితే అకస్మాత్తుగా పశ్చిమ దిశలో ప్రయాణించవలసి వస్తే.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి.
  5. బుధవారం నల్లని బట్టలు ధరించవద్దు. హిందూ మత గ్రంథాల ప్రకారం బుధవారం నల్ల బట్టలు ధరించడం వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. భార్యాభర్తల మధ్య సంబంధాలలో ఉద్రిక్తతను సృష్టిస్తుంది.
  6. బుధవారం రోజున ఇంటికి వచ్చే ఏ పేదవాడిని లేదా ఆవును తరిమికొట్టవద్దు. ఇలా చేస్తే బుధ గ్రహం ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. బుధవారం రోజున పేదలకు లేదా ఆవుకు ఆహారం అందించడం ప్రయోజనకరంగా ఉంటుంది.
  7. బుధవారం రోజున ఇంట్లో ఆడవారిని అంటే కుమార్తె, సోదరి, మేనకోడలు ఇలా ఎవరినైనా సరే కొట్టవద్దు, తిట్టవద్దు. ఏ విధంగానూ అనుచితంగా ప్రవర్తించవద్దు. బుధవారం రోజున వీరు చేసే చిన్న చిన్న తప్పులను పట్టించుకోకుండా క్షమించండి.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.