AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: క్రిస్ గేల్ ఆల్‌టైమ్ రికార్డు బద్ధలు కొడతా.. రాజస్థాన్ రాయల్స్ సంచలనం వార్నింగ్

Vaibhav Sooryavanshi : 14 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో క్రిస్ గేల్ నెలకొల్పిన 175 పరుగుల రికార్డును బద్ధలు కొడతానని ప్రకటించి క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ తన ఖాతాలో ఇప్పటికే అనేక అరుదైన రికార్డులను వేసుకున్నాడు.

IPL 2026: క్రిస్ గేల్ ఆల్‌టైమ్ రికార్డు బద్ధలు కొడతా.. రాజస్థాన్ రాయల్స్ సంచలనం వార్నింగ్
Rajasthan Royals
Rakesh
|

Updated on: Mar 16, 2026 | 3:08 PM

Share

IPL 2026: క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ పేరే మార్మోగిపోతుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో అత్యంత పిన్న వయస్కుడిగా ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన ఈ బీహార్ బుడ్డోడు, ఇప్పటికే తన విధ్వంసకర బ్యాటింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా బీసీసీఐ నిర్వహించిన నమన్ అవార్డ్స్ వేడుకలో వైభవ్ సూర్యవంశీ ఒక సంచలన ప్రకటన చేశాడు. ఐపీఎల్ లో 13 ఏళ్లుగా ఎవరికీ సాధ్యం కాని క్రిస్ గేల్ 175 పరుగుల రికార్డును తాను ఈ ఐపీఎల్ 2026 సీజన్ లో బద్ధలు కొడతానని ధీమా వ్యక్తం చేశాడు.

గత ఏడాది ఐపీఎల్ 2025లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచిన వైభవ్ సూర్యవంశీ, అదే ఊపును 2026 అండర్-19 వరల్డ్ కప్ లోనూ కొనసాగించాడు. ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి భారత్ కు ఆరోసారి టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు అదే మ్యాజిక్ ను ఐపీఎల్ స్టేజ్ పై రిపీట్ చేయాలని వైభవ్ భావిస్తున్నాడు. ఆరు సిక్సర్లు కొట్టడం లేదా ఫాస్టెస్ట్ సెంచరీ చేయడం కంటే, గేల్ నెలకొల్పిన అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును అధిగమించడమే తన ప్రధాన లక్ష్యమని ఈ యువ సెన్సేషన్ స్పష్టం చేశాడు.

వైభవ్ సూర్యవంశీ తన ఖాతాలో ఇప్పటికే అనేక అరుదైన రికార్డులను వేసుకున్నాడు. ఐపీఎల్ లో సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సెంచరీ చేసిన యువకుడిగా అతను చరిత్ర సృష్టించాడు. 2013లో పూణే వారియర్స్ పై క్రిస్ గేల్ చిన్నస్వామి స్టేడియంలో చేసిన 175 పరుగుల రికార్డు ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయలేకపోయారు. కానీ, వైభవ్ క్రీజులో ఉంటే ఆ రికార్డు ప్రమాదంలో ఉన్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ తరఫున మార్చి 30న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ లో వైభవ్ తన ఐపీఎల్ 2026 ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us