AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli : విరాట్ మనసు గెలుచుకున్న ఆటగాళ్లు వీళ్లే.. గెయిల్, డివిలియర్స్‎కి ఆర్సీబీలో చోటు.. మరి కెప్టెన్ ఎవరంటే ?

Virat Kohli : విరాట్ కోహ్లీ తన ఆల్ టైమ్ ఆర్సీబీ ఎలెవన్‌ను ప్రకటించాడు. గెయిల్, డివిలియర్స్, స్టార్క్, కుంబ్లే వంటి దిగ్గజాలకు ఇందులో చోటు దక్కింది. రజత్ పాటిదార్‌ను మిడిల్ ఆర్డర్ కీలక ప్లేయర్‌గా ఎంచుకున్నాడు. 2025లో ఆర్సీబీకి తొలి టైటిల్ అందించి చరిత్ర సృష్టించిన పాటిదార్ పై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు.

Virat Kohli  : విరాట్ మనసు గెలుచుకున్న ఆటగాళ్లు వీళ్లే.. గెయిల్, డివిలియర్స్‎కి ఆర్సీబీలో చోటు.. మరి కెప్టెన్ ఎవరంటే ?
ఐపీఎల్ 2026కు రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ క్రమంలో ప్రస్తుతం అందరి చూపు కింగ్ కోహ్లీపైనే నిలిచింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఓ అద్భుతమైన రికార్డ్ సృష్టించే ఛాన్స్ ఉంది. దీంతో క్రిస్ గేల్, రోహిత్ శర్మల లిస్ట్ లో చేరనున్నాడు.
Rakesh
|

Updated on: Mar 16, 2026 | 3:08 PM

Share

Virat Kohli : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐకాన్ విరాట్ కోహ్లీ తన ఆల్ టైమ్ ఆర్సీబీ ఎలెవన్‎ను ప్రకటించి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి సిద్ధమవుతున్న తరుణంలో, కోహ్లీ ఎంచుకున్న ఈ టీమ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన టీమ్ లో ఓపెనర్లుగా వినాశకర బ్యాటర్ క్రిస్ గెయిల్, తనను తాను ఎంచుకున్నాడు కోహ్లీ. ఐపీఎల్ లో 8600 కు పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా కోహ్లీకి ఈ టీమ్ లో తిరుగులేని చోటు దక్కింది.

ఈ డ్రీమ్ టీమ్ లో మూడో స్థానంలో ఆర్సీబీ లెజెండ్ ఏబీ డివిలియర్స్‌ను, నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్‌ను కోహ్లీ ఎంపిక చేశాడు. వీరిద్దరూ గతంలో ఆర్సీబీ బ్యాటింగ్ వెన్నెముకగా ఉండేవారు. ఐదవ స్థానంలో ప్రస్తుత కెప్టెన్ రజత్ పాటిదార్‌కు కోహ్లీ చోటు కల్పించడం విశేషం. 2025లో ఆర్సీబీకి తొలి టైటిల్ అందించి చరిత్ర సృష్టించిన పాటిదార్ పై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. ఇక వికెట్ కీపర్, ఫినిషర్‌గా దినేష్ కార్తీక్‌ను ఎంచుకున్నాడు.

బౌలింగ్ విభాగంలో కోహ్లీ అత్యంత పటిష్టమైన ఆటగాళ్లను తీసుకున్నాడు. విదేశీ ప్లేయర్లుగా మిచెల్ స్టార్క్, డేల్ స్టెయిన్‌లను ఎంపిక చేసి పేస్ విభాగాన్ని బలోపేతం చేశాడు. వీరికి తోడుగా హర్షల్ పటేల్‌ను మూడో సీమర్‌గా, ఆల్‌రౌండర్‌గా ఎంచుకున్నాడు. స్పిన్ బాధ్యతలను దిగ్గజం అనిల్ కుంబ్లే, ఆర్సీబీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన యుజ్వేంద్ర చాహల్‌కు అప్పగించాడు. ఈ టీమ్ లో మొత్తం నలుగురు విదేశీ ఆటగాళ్లు (గెయిల్, ఏబీడీ, స్టార్క్, స్టెయిన్) ఉన్నారు.

అయితే, ఈ స్టార్ స్టడెడ్ టీమ్ కి కెప్టెన్ ఎవరనేది మాత్రం కోహ్లీ వెల్లడించలేదు. ఐపీఎల్ 2026 సీజన్ ఓపెనర్ మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న ఆర్సీబీ, ఈసారి కూడా టైటిల్ నిలుపుకోవాలని పట్టుదలతో ఉంది. కోహ్లీ ఎంచుకున్న ఈ ఆల్ టైమ్ ఎలెవన్ లో ఉన్న ఆటగాళ్లంతా కలిసి ఆడితే, ఏ టీమ్ అయినా బెంబేలెత్తాల్సిందేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవన్

క్రిస్ గెయిల్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, కేఎల్ రాహుల్, రజత్ పాటిదార్, దినేష్ కార్తీక్ (కీపర్), హర్షల్ పటేల్, అనిల్ కుంబ్లే, మిచెల్ స్టార్క్, డేల్ స్టెయిన్, యుజ్వేంద్ర చాహల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us