AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మే 26 దినఫలాలు: ఈ రాశుల వారికి కొత్త అవకాశాలు, ఆదాయం పెరిగే ఛాన్స్

మే 26, 2026 మంగళవారం రాశిఫలాల ప్రకారం మేష రాశి వారికి ఉద్యోగంలో గౌరవం, గుర్తింపు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారు పనిభారం, ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉండగా, మిథున రాశి వారికి కొత్త అవకాశాలు, ప్రాధాన్యం లభించే యోగం ఉంది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి దినఫలాల్లో ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులపై ఆసక్తికర సూచనలు ఉన్నాయి.

మే 26 దినఫలాలు: ఈ రాశుల వారికి కొత్త అవకాశాలు, ఆదాయం పెరిగే ఛాన్స్
Rashifal In Telugu 26 May 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 26, 2026 | 5:45 AM

Share

దిన ఫలాలు (మే 26, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, పని ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. మిథున రాశి వారికి ఉద్యోగంలో అనేక విధాలుగా ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు అంది వస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో అధికారులు, సహోద్యోగులు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి సంబంధమైన లాభాలు చేతికి అందుతాయి. మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిత్రులకు అండగా ఉంటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, పని ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ, వృథా ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కొద్దిగా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. పిల్లలు చదువుల్లో వృద్ధిలోకి వస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అనేక విధాలుగా ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి జీవితంలో కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి సంబంధమైన వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. అవసరానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులు ఆశించిన సమాచారాన్ని అందుకుంటారు. ఉద్యోగం మారేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెంచుతారు. ఆరోగ్యం బాగా నిలకడగా సాగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి అనుకోకుండా శుభవార్తలు అందుతాయి. వ్యాపారాన్ని విస్తరించడం గానీ, పెట్టుబడులు పెంచడం గానీ జరుగుతుంది. ధనాదాయం చాలావరకు బాగుంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. బంధుమిత్రులతో వివాదాలు, అపార్థాలు తొలగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. వృత్తి జీవితంలో కొత్త ఒప్పందాలు ఏర్పడతాయి. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు, భూమి క్రయవిక్ర యాల్లో అనుకూల ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలు, ఆటంకాలు కలిగినప్పటికీ, పట్టుదలగా వాటిని పూర్తి చేస్తారు. ఇతరుల సొంత వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రోజంతా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారపరంగా ఎదురైన సమస్యలను అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పిల్లల చదువులకు సంబంధించిన విషయాల్లో శుభ వార్తలు వింటారు. బంధువుల రాకపోకలుంటాయి. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల వల్ల బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలకు అవకాశం ఉంది. స్థిరాస్తికి సంబంధించిన క్రయవిక్రయాల్లో ఒప్పందాలు కుదర్చుకుంటారు. పితృ వర్గం నుంచి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. ఆస్తికి సంబంధించిన దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమై, కాస్తంత మానసిక ప్రశాంతత పొందుతారు. కుటుంబంతో దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఒక ప్రధానమైన కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రోజంతా ప్రశాంతంగా, అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహకాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. గౌరవమర్యాదలకు లోటుండదు. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. చదువుల్లో పిల్లలకు అండగా ఉంటారు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచనలతో అధికారులు లబ్ధి పొందుతారు. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ఇంటా బయటా బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు కార్యక్రమంలో పాల్గొంటారు. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది.

Follow Us