ఆకలిని కంట్రోల్ చేసే 10 లో-కేలరీ హెల్తీ స్నాక్స్

23-06-2026

Pic credit - Instagram

Phani Ch

బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నప్పుడు లేదా ఫిట్‌గా ఉండాలనుకున్నప్పుడు మధ్యమధ్యలో వచ్చే ఆకలి కేకలు పెద్ద సమస్యగా మారుతుంటాయి.

అటువంటప్పుడు జంక్ ఫుడ్‌కు బదులుగా తక్కువ కేలరీలు ఉండే హెల్తీ స్నాక్స్ తీసుకోవడం ఎంతో ఉత్తమం.

అటువంటప్పుడు జంక్మొదటిగా వేపిన శనగలు ఆకలిని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల  కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. ఫుడ్‌కు బదులుగా తక్కువ కేలరీలు ఉండే హెల్తీ స్నాక్స్ తీసుకోవడం ఎంతో ఉత్తమం.

రెండవది తామర గింజలు లేదా మఖానా. నెయ్యిలో కొద్దిగా వేయించిన మఖానా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల బరువు పెరగరు.

మూడవది ఉడికించిన గుడ్డు. ప్రోటీన్ అధికంగా ఉండే బాయిల్డ్ ఎగ్ రోజులో ఒకటి తినడం వల్ల శరీరానికి అవసరమైన ఎనర్జీ అందడమే కాకుండా ఎక్కువసేపు ఆకలి వేయకుండా చూస్తుంది.

నాల్గవది ఎయిర్-పాప్డ్ పాప్‌కార్న్. నూనె లేదా వెన్న లేకుండా ఇంట్లోనే తయారు చేసుకునే పాప్‌కార్న్ ఉప్పు తినాలనే కోరికను తీర్చడమే కాకుండా, తక్కువ కేలరీలతో కడుపును నింపుతుంది.

ఐదవదిగా ఫైబర్ ఎక్కువగా ఉండే క్యారెట్ ముక్కలు. ఆరవది పుచ్చకాయ. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతూ ఆకలిని తగ్గిస్తుంది.

ఏడవది విటమిన్లు నిండిన స్ట్రాబెర్రీలు. ఎనిమిదవ స్నాక్ గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ. ఇది మెటబాలిజాన్ని పెంచడమే కాకుండా అకాల ఆకలిని దూరం చేస్తుంది.

తొమ్మిదవదిగా నానబెట్టిన బాదం మరియు వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్. ఇవి కొద్దిగా తిన్నా మంచి శక్తిని ఇస్తాయి . పదవదిగా తీపి తినాలనే కోరికను ఆరోగ్యకరమైన పద్ధతిలో ఒక చిన్న ముక్క డార్క్ చాక్లెట్ తీసుకోవచ్చు.