AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

July Born Horoscope: గురు బలం.. జూలై నెలలో పుట్టిన వారికి దశ తిరిగే ఛాన్స్..!

July Born Sun Sign Astrology: సౌరమానం ప్రకారం జూలై నెలలో పుట్టినవారు సాధారణంగా కర్కాటక రాశికి చెందుతారు. చంద్రుడి ప్రభావం వల్ల ఈ రాశివారికి భావోద్వేగాలు ఎక్కువగా ఉండి జీవితంలో ఒడిదుడుకులు కనిపించవచ్చు. అయితే గురు బలం అనుకూలంగా ఉండటం వల్ల ఆదాయం, ఆరోగ్యం, గౌరవ మర్యాదల్లో పురోగతి కనిపించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా గతం కంటే మెరుగవుతుందని సూచన.

July Born Horoscope: గురు బలం.. జూలై నెలలో పుట్టిన వారికి దశ తిరిగే ఛాన్స్..!
July Born People Horoscope
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 23, 2026 | 3:47 PM

Share

రవి సంచారం మీద ఆధారపడిన సౌరమానం ప్రకారం జూలై నెలలో పుట్టినవారు సాధారణంగా కర్కాటక రాశికి చెందినవారవుతారు. రాశ్యధిపతి చంద్రుడికి వృద్ధి, క్షీణ దశలు ఉన్నందువల్ల ఈ రాశివారికి కూడా జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. జూలై నెలలో పుట్టిన వారికి కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. భావోద్వేగాలు ఎక్కువగా కలుగుతాయి. సౌరమానం ప్రకారం కూడా ఈ నెలంతా ఈ రాశివారికి గురు బలం ఎక్కువగా ఉన్నందువల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి, గౌరవ మర్యాదలకు లోటుండకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది.

వృత్తి, ఉద్యోగాలు

జీవన కారకుడు శని భాగ్య స్థానంలో ఉన్నందువల్ల జూలై వారికి ఈ నెలలో విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు తరచుగా వెళ్లే అవకాశం కలుగుతుంది. విదేశీ సంపాదన యోగం పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో సక్సెస్ అవుతారు. ఉద్యోగం మారడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి.

ఆర్థిక పరిస్థితి

ఆర్థిక పరిస్థితి గతం కంటే కొద్దిగా మెరుగుపడుతుంది. ఆర్థిక విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి కానీ, ఆర్థిక లావాదేవీలకు మాత్రం దూరంగా ఉండడం శ్రేయస్కరం. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి జూలై జాతకులకు పనికి రాదు. పిత్రార్జితం లభించే అవ కా శం ఉంది. కొద్దిగా ఆస్తి లాభం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

కుటుంబ జీవితం

జూలై జాతకులకు ఒకటి రెండు కుటుంబ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కుటుంబం మీద ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించి ప్లాన్లు వేస్తారు. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధాలు కలిసి వస్తాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. పిల్లల్లో ఒకరు ఉన్నత విద్యలు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి.

ఆరోగ్య పరిస్థితి

జూలై వారు స్వల్ప అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. ప్రయాణాల్లో కూడా అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు కలుగుతాయి. ఆహార, విహారాల్లో, విందు వినోదాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. జూలై జాతకుల్ని శ్వాసకోశ సంబంధమైన సమస్యలు పీడిస్తాయి. ప్రయాణాలు తగ్గించుకోవడం శ్రేయస్కరం. వ్యసనాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్కోసారి ఖర్చులు అదుపు తప్పే అవకాశం ఉంది. ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం ఉత్తమం.

Also Read: అరుదైన పరివర్తన యోగం.. ఆ రాశుల వారికి ఊహించని అదృష్టాలు

Follow Us