AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moon Transit: చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఇందులో మీ రాశి ఉందా..?

జూన్ 29, 30, జూలై 1 తేదీల్లో ధనూ రాశిలో చంద్రుడు సంచారం చేయబోతున్నాడు. ఈ సమయంలో చంద్రుడికి ప్రత్యేకమైన శుభబలం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది. రవి, కుజ, శని గ్రహాల పూర్ణ దృష్టి చంద్రుడిపై ఉండటంతో పాటు, కర్కాటక రాశిలో ఉన్న గురువుతో పరివర్తన యోగం ఏర్పడుతోంది. ఫలితంగా ఈ చంద్రుడు యోగదాయకుడిగా మారి మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మీనం రాశుల వారికి రాజయోగాలు, ధనయోగాలు కలిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Moon Transit: చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఇందులో మీ రాశి ఉందా..?
Moon Transit
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 23, 2026 | 4:34 PM

Share

ఈ నెల(జూన్) 29, 30, జూలై 1 తేదీల్లో ధనూ రాశిలో సంచారం చేయబోతున్న చంద్రుడికి ఒక విశేషమైన బలం కలగబోతోంది. ధనూ రాశికి చంద్రుడికి అత్యంత శుభప్రదమైన రాశి. ఇందులో మూడు రోజుల పాటు సంచారం చేయబోతున్న చంద్రుడిని రవి, కుజ, శనులు పూర్ణ దృష్టితో వీక్షించడం జరుగుతోంది. కర్కాటక రాశిలో ఉన్న గురువుకు, ధనూ రాశిలో ఉన్న చంద్రుడికి పరివర్తన కూడా జరుగుతోంది. ఫలితంగా ఈ చంద్రుడు అత్యంత యోగదాయకుడుగా మారి, మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మీన రాశుల వారికి రాజయోగాలు, ధన యోగాలు కలిగించే అవకాశం ఉంది. ఈ సమయంలో లాభదాయక వ్యవహారాలు చేపట్టడం మంచిది.

  1. మేషం: ఈ రాశికి చంద్ర బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగ జీవితంలో ఊహించని విధంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితం కూడా కొత్త పుంతలు తొక్కుతుంది. ఇంటా బయటా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి కనక వర్షం కురిపిస్తాయి. ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తేలికగా నెరవేరుతుంది. ఆదాయం వృద్ధి అనూహ్యంగా చెందుతుంది.
  2. మిథునం: ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన చంద్రుడిని కుజ, రవి, శనులు వీక్షించడం వల్ల ఈ రాశివారికి రాజయోగాలు, ధన యోగాలు కలగబోతున్నాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ఆదాయం బాగా పెరగడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారమవుతాయి. త్వరలో పెళ్లి, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనల వంటి శుభ కార్యాలు జరుగుతాయి. ఆస్తిపాస్తులు సంక్రమిస్తాయి. పిత్రార్జితం లభించే అవకాశం కూడా ఉంది.
  3. కర్కాటకం: ఈ రాశ్యధిపతి చంద్రుడిని శని, కుజ, రవులు వీక్షించడంతో పాటు, గురువుతో పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అష్టమ రాహువు ప్రభావం కూడా చాలా వరకు తగ్గి, కొన్ని ముఖ్యమైన కష్టనష్టాల నుంచి బయటపతారు. గృహ ప్రయత్నాలు సానుకూల పడతాయి. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. పెండింగులో ఉన్న శుభ కార్యాలు త్వరలో జరిగే అవకాశం ఉంది.
  4. కన్య: ఈ రాశికి లాభాధిపతి అయిన చంద్రుడికి బలం పట్టడం వల్ల ఈ రాశివారికి శుభ యోగాలు ఎక్కువగా కలుగుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. చాలా కాలంగా వేధిస్తున్న ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది.
  5. ఇవి కూడా చదవండి
  6. వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానాధిపతి అయిన చంద్రుకి ధన స్థానంలో బలం పెరగడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ది చెందుతుంది. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారడం జరుగుతుంది. రావలసిన డబ్బు, రాదనుకున్న సొమ్ము కూడా చేతికి అందుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు.
  7. మీనం: ఈ రాశికి దశమ స్థానంలో ఉన్న చంద్రుడిని మూడు గ్రహాలు వీక్షించడం, రాశ్యధిపతి గురువుతో పరివర్తన చెందడం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. రాజయోగాలు పట్టడంతో పాటు ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కూడా కలుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి.

Also Read: కుజుడి కటాక్షం.. వారికి ఆస్తి, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి

Follow Us