AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Astrology: కుజుడి కటాక్షం.. వారికి ఆస్తి, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి

Mars Transit in Taurus: జూన్ 21 నుంచి ఆగస్టు 2, 2026 వరకు కుజుడు వృషభ రాశిలో సంచరించనున్నాడు. ఈ సంచారం ప్రభావంతో మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకర రాశుల వారికి ఆదాయం పెరగడం, భూ-ఆస్తి లాభాలు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాల పరిష్కారం వంటి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 20, 2026 | 6:11 PM

Share
Kuja Gochar 2026: ఈ నెల(జూన్) 21వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు కుజ గ్రహం వృషభ రాశిలో సంచారం ప్రారంభిస్తోంది. వృషభ రాశి కుజ గ్రహానికి శత్రు స్థానం. అయితే, ఈ రాశిలో కుజుడికి పోరాట స్ఫూర్తి పెరుగుతుంది. ఈ రాశిలో ఉన్నంత కాలం కుజుడు కొన్ని రాశులవారి ఆస్తి, ఆర్థిక సమస్యలను పూర్తిగా పరిష్కరించే అవకాశం ఉంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకర రాశులకు ఈ కుజ సంచారం అనేక అదృష్టాలను తీసుకువస్తుంది. ఆదాయం వృద్ధి చెందడం, భూ లాభం కలగడం, ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. కుజుడికి పరిహారంగా సుబ్రహ్మణ్యాష్టకం లేదా హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

1 / 7
మేషం: రాశ్యధిపతి కుజుడు ద్వితీయ స్థానంలో ప్రవేశించడం వల్ల ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆస్తి సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. తప్పకుండా భూ లాభం కలుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో బదిలీలు, స్థాన చలనాలకు అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి బాగా లాభిస్తుంది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది.

2 / 7
వృషభం: ఈ రాశిలో కుజ సంచారం వల్ల ఈ రాశివారికి అనుకోకుండా ఆస్తి లాభం కలుగుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి నిశ్చయం కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో కలలో కూడా ఊహించని ఆఫర్లు అందుతాయి. సోదరులతో ఆస్తి వివాదంలో రాజీమార్గం అనుసరిస్తారు.

3 / 7
కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో కుజ సంచారం వల్ల అనేక విధాలుగా ధన యోగాలు కలుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడడంతో పాటు లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగంలో పదో న్నతులు కలుగుతాయి. జీతభత్యాలు పెరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి, అభివృద్ధి బాటపట్టే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి.

4 / 7
సింహం: ఈ రాశికి దశమ స్థానంలో కుజ సంచారం వల్ల అధికార యోగం పడుతుంది. నాయకత్వ పదవి లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. ఉద్యోగరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. మరింత మంచి జీతభత్యాలు, హోదాతో కూడిన ఉద్యోగంలోకి మారడా నికి అవకాశం ఉంది. నిరుద్యోగుల కల సాకారం అవుతుంది. పలుకుబడి కలిగిన కుటుంబంతో పెళ్లి నిశ్చయం అవుతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. షేర్లు లాభిస్తాయి.

5 / 7
వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో రాశ్యధిపతి కుజుడి సంచారం వల్ల విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లడం జరుగుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారమై, విలువైన భూలాభం కలుగుతుంది. విస్తృతంగా విహార యాత్రలు, తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.

6 / 7
మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో కుజ సంచారం వల్ల రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. రాజయోగాలు పడతాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు, సమర్థత బాగా రాణిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపట్టి లబ్ధి పొందుతారు. అనేక విధాలుగా ఆదాయం వృద్ది చెందుతుంది. పిల్లలు వృద్ధి లోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది.

7 / 7
Follow Us