AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘డెలివర్డ్’ మెసేజ్ వచ్చింది.. కానీ భోజనం రాలేదు! CCTVలో బయటపడిన అసలు నిజం!

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆన్‌లైన్ డెలివరీకి సంబంధించిన షాకింగ్ ఘటన ఒకటి కోల్‌కతాలో వెలుగుచూసింది. జొమాటో ద్వారా ఆర్డర్ చేసిన ఫుడ్‌ను డెలివరీ చేయకుండానే "డెలివరీ పూర్తైంది" అని చూపించి, డెలివరీ బాయ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడని ఓ కస్టమర్ ఆరోపించాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: ‘డెలివర్డ్’ మెసేజ్ వచ్చింది.. కానీ భోజనం రాలేదు! CCTVలో బయటపడిన అసలు నిజం!
Zomato Customer Catches Delivery Partner
Balaraju Goud
|

Updated on: Jun 23, 2026 | 5:20 PM

Share

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆన్‌లైన్ డెలివరీకి సంబంధించిన షాకింగ్ ఘటన ఒకటి కోల్‌కతాలో వెలుగుచూసింది. జొమాటో ద్వారా ఆర్డర్ చేసిన ఫుడ్‌ను డెలివరీ చేయకుండానే “డెలివరీ పూర్తైంది” అని చూపించి, డెలివరీ బాయ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడని ఓ కస్టమర్ ఆరోపించాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సుమిత్ చక్రవర్తి అనే కస్టమర్ తన ఇంటి వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఇంటి గేటు వద్దకు వచ్చి, ఆర్డర్ అందించినట్లు యాప్‌లో నమోదు చేశాడు. అంతేకాకుండా గేటు ఫొటోను కూడా అప్‌లోడ్ చేశాడని సుమిత్ చక్రవర్తి పేర్కొన్నాడు. అయితే సీసీటీవీ వీడియోలో మాత్రం డెలివరీ బాయ్ చేతిలో ఫుడ్ ప్యాకెట్‌తోనే తిరిగి వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపించడం వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై స్పందించిన సుమిత్ చక్రవర్తి, సంబంధిత వీడియోను జొమాటోకు పంపించి పూర్తి రీఫండ్ ఇవ్వాలని, అలాగే డెలివరీ బాయ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ అంశంపై జొమాటో సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇదిలా ఉండగా, ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. పలువురు వినియోగదారులు తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని వ్యాఖ్యానించారు. ఫుడ్ డెలివరీ సమయంలో OTP ఆధారిత నిర్ధారణ విధానాన్ని తప్పనిసరి చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాలు లేని వినియోగదారులు ఇలాంటి సందర్భాల్లో తమ వాదనను నిరూపించుకోవడం కష్టమని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, పూర్తి వీడియో అందుబాటులో లేకపోవడంతో తొందరపడి నిర్ణయాలకు రావొద్దని కొందరు సూచిస్తున్నారు. సంస్థ అంతర్గత విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాలని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారి, డెలివరీ సేవల విశ్వసనీయతపై చర్చకు తెరలేపింది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us