AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో పాపం.. ఒక్కసారిగా నటి కారుపై కూలిన భారీ వృక్షం!

ముంబైలో వర్షాలు ప్రారంభం కాగానే చెట్లు కూలిపోతున్నాయి. నటి ఖుషీ ముఖర్జీ లగ్జరీ కారుపై అంధేరిలో భారీ చెట్టు కూలడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మాన్‌సూన్ ఆలస్యంగా వచ్చినా, తొలి వర్షాలకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

అయ్యో పాపం.. ఒక్కసారిగా నటి కారుపై కూలిన భారీ వృక్షం!
Khushi Mukherjee
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jun 23, 2026 | 5:40 PM

Share

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీ చెట్లు కూలిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నటి ఖుషీ ముఖర్జీకి చెందిన లగ్జరీ కారు ప్రమాదానికి గురైంది. మంగళవారం ఉదయం నుంచి ముంబై నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంధేరి, బాంద్రా, మలాడ్, కాందివలి, దహిసర్, పవయ్, విక్రోలి, ఘాట్‌కోపర్ తదితర ప్రాంతాల్లో వర్షం నమోదైంది. ఈ నేపథ్యంలో అంధేరి లోఖండ్వాలా ప్రాంతంలోని ఓ హౌసింగ్ సొసైటీ ప్రాంగణంలో పార్క్ చేసి ఉన్న నటి ఖుషీ ముఖర్జీ లగ్జరీ కారుపై భారీ చెట్టు ఒక్కసారిగా కూలిపోయింది.

చెట్టు కూలడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఘటన సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం అనంతరం స్థానికంగా కొంతసేపు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న సిబ్బంది చెట్టును తొలగించి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చారు. ముంబైలో ఈ ఏడాది మాన్సూన్ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ తొలి వర్షాలకే చెట్లు కూలిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వర్షాలు, బలమైన ఈదురుగాలుల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో వాహనాలను పార్క్ చేయడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.

వీడియో చూడండి

Follow Us