తెలుగులో స్పీడ్ పెంచిన అందాల భామ ఐశ్వర్య రాజేష్ ..
23 June 2026
Pic credit - Instagram
Rajeev
ఐశ్వర్య రాజేశ్.. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది అందాల ముద్దుగుమ్మ. తన నటనతో మెప్పించింది.
ఈ అమ్మడు ఎక్కువగా తమిళ సినిమాల్లో నటించింది. కెరీర్ బిగినింగ్ లో ఓ టీవీ ఛానెల్ కోసం కామెడీ షోలో యాంకర్ గా చేశారు.
రియాల్టీ షో మనాడా మయిలాడ గెలుచుకున్న తరువాత, ఆమె అవగాళమ్ ఇవర్గలం (2011) లో సినిమాల్లో పరిచయమయింది ఐశ్వర్య.
అత్తాచాటి (2012) లో నటించిన తరువాత మంచి పేరు వచ్చింది. ఆమె మొట్టమొదటి మలయాళ చిత్రం జోమోన్నే సువిశ్శేంగల్.
అర్జున్ రాంపాల్ సరసన డాడీ అనే హిందీ సినిమాలో ఆమె తొలిసారిగా నటించింది. 2014 లో ఆమె నటించిన కాక ముట్టై అనే తమిళ చిత్రానికి గాను ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది.
కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది. మిస్ మ్యాచ్ అనే సినిమా చేసింది ఐశ్వర్య రాయ్.
ఇక ఇప్పుడు ఈ అమ్మడు తెలుగులో వరుసగా సినిమాలు చేసి మెప్పిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ యాక్టివ్ గా ఉంటుంది.