AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ఈ క్లాసికల్ డ్యాన్సర్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ లక్కీ హీరోయిన్.. సినిమా తీస్తే హిట్టే

ఛైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత మోడల్ గా చేసింది. పలు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించింది. ఇక ఇప్పుడు హీరోయిన్ గా జెట్ స్పీడ్ లో దూసుకుపోతోందీ అందాల తార. లక్కీ హీరోయిన్ గా పేరున్న ఈ బ్యూటీ చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్ గానే నిలిచాయి.

Actress: ఈ క్లాసికల్ డ్యాన్సర్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ లక్కీ హీరోయిన్.. సినిమా తీస్తే హిట్టే
Tollywood Actress
Basha Shek
|

Updated on: Jun 23, 2026 | 5:35 PM

Share

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఠక్కున చూసి ప్రొఫెషనల్ క్లాసికల్ డ్యాన్సర్ అనుకునరు. ఆమె ఇప్పుడు ఫేమస్ హీరోయిన్. ఇక ఫొటో వచ్చేసి ఆమె టీనేజ్ లోది. అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయిందీ అందాల తార. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటోంది. అందుకే ఇప్పుడీ ముద్దుగుమ్మ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. స్టార్ హీరోలు, డైరెక్టర్లు తమ సినిమాల్లో ఈ హీరోయిన్ నే తీసుకుంటున్నారు. కాగా ఈ సొగసరి 2017 నుంచే సినిమాలు చేస్తోంది. కానీ తెలుగు ఆడియెన్స్ కు రెండేళ్ల క్రితమే పరిచయమైంది. ఆమె నటించిన ఒక మలయాళం సినిమా తెలుగులోనూ డబ్బింగ్ అయ్యింది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమా ట్యాగ్ తో రిలీజైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ 100 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది. ముఖ్యంగా యూత్ అయితే ఈ సినిమాను ఎగబడి చూశారు. అందులోనూ హీరోయిన్ కోసమే చాలా మంది సినిమాకు వెళ్లారంటే అతి శయోక్తి కాదు. అంతలా కుర్రకారు హృదయాలు కొల్లగొట్టిందీ అందాల తార. తన క్యూట్ యాక్టింగ్ తో చాలా మందికి ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయిందామె. దీని తర్వాత ఆమె నటించిన సినిమాలు కూడా దాదాపు హిట్ గానే నిలిచాయి.

ప్రస్తుతం లక్కీ హీరోయిన్ ట్యాగ్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీ మరెవరో కాదు మమితా బైజు. సోమవారం ( జూన్ 22) పుట్టిన రోజు నేపథ్యంలో ఆమె చిన్న నాటి ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలయ్యాయి. కాగా ప్రేమలు తర్వాత రెబల్, డ్యూడ్, కర సినిమాల్లో నటించింది. ఇందులో డ్యూడ్ కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక రెబల్, కర యావరేజ్ గా నిలిచాయి. ఇక ఈ బ్యూటీ నటించిన జన నాయగన్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో పాటు సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్, ఇరందు వానమ్ వంటి క్రేజీ ప్రాజెక్టులు ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మమితా బైజు లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? ఈ మిస్టేక్స్ చేస్తే నష్టం
పీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? ఈ మిస్టేక్స్ చేస్తే నష్టం
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి ఆమె అవుట్
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి ఆమె అవుట్
లవంగాల నైట్ క్రీమ్‌‌తో ముడతలు మాయం..ఇంట్లోనే తయారు చేసుకునే సహజ
లవంగాల నైట్ క్రీమ్‌‌తో ముడతలు మాయం..ఇంట్లోనే తయారు చేసుకునే సహజ
రాష్ట్రంలో కొత్తగా మరో 9లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!
రాష్ట్రంలో కొత్తగా మరో 9లక్షల ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్!
పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే
పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే
ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే
ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే
ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..
ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..
ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?
ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?