AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramya Krishna: రమ్యకృష్ణకు అన్నగా, భర్తగా, తండ్రిగా నటించిన ఏకైక హీరో అతడే.. ఇప్పటికీ బిజీ యాక్టర్.. ఎవరంటే..

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్లలో రమ్య కృష్ణ ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. ఇప్పటికీ వరుస సినిమాలతో అలరిస్తుంది. అప్పట్లో కథానాయికగా నటించిన ఆమె.. ఇప్పుడు సహాయ నటిగా కనిపిస్తూ సినిమాల్లో బిజీగా ఉంటుంది. అయితే ఒకే హీరోకు చెల్లిగా, కూతురిగా, భార్యగా నటించిందని మీకు తెలుసా.. ? ఇప్పటికీ ఆ ఇద్దరూ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు.

Ramya Krishna: రమ్యకృష్ణకు అన్నగా, భర్తగా, తండ్రిగా నటించిన ఏకైక హీరో అతడే.. ఇప్పటికీ బిజీ యాక్టర్.. ఎవరంటే..
Ramya Krishna
Rajitha Chanti
|

Updated on: Jun 23, 2026 | 4:49 PM

Share

సాధారణంగా సినిమాల్లో చాలాసార్లు నటీనటులు కలిసి నటించిన చిత్రాలు సూపర్ హిట్ అవుతుంటాయి. అయితే వెండితెరపై అలరించిన కొన్ని జంటలకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆ జంట కెమిస్ట్రీ తెరపై సక్సెస్ కావడమే కాకుండా అడియన్స్ హృదయాలను గెలుచుకుంటుంది. ఇదిలా ఉంటే.. రమ్యకృష్ణ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ.. హిందీ భాషలలో స్టార్ హీరోలతో జతకట్టింది. అప్పట్లో కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆమె.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కీలకపాత్రలు పోషిస్తూ సహయ నటిగా బిజీగా ఉంటుంది. అయితే ఇండస్ట్రీలో టాప్ హీరో ఒకరు కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే రమ్యకృష్ణకు అన్నగా, తండ్రిగా, భర్తగా కనిపించారన్న సంగతి తెలుసా.. ? అవును.. ఒకే నటుడితో పలు చిత్రాల్లో మూడు విభిన్న పాత్రలు పోషించింది రమ్యకృష్ణ. ఆ నటుడు మరెవరో కాదు.. టాలీవుడ్ విలక్షణ నటుడు నాజర్. దాదాపు 550కి పైగా సినిమాల్లో నటించారు. ఇప్పటికీ చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..

నాజర్, రమ్యకృష్ణ కాంబోలో అనేక చిత్రాలు వచ్చాయి. అందులో బాహుబలి ఒకటి. ఇందులో రమ్యకృష్ణ శివగామి పాత్రలో నటించగా.. ఆమె భర్తగా కనిపించారు నాజర్. అంతకు ముందు సూపర్ స్టార్ రజినీకాంత్, సౌందర్య జంటగా నటించిన నరసింహ సినిమాలో రమ్యకృష్ణ విలన్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇందులో నాజర్ సైతం ముఖ్య పాత్ర పోషించారు. ఈ చిత్రంలో నాజర్ చెల్లిగా కనిపించింది రమ్యకృష్ణ.

ఎక్కువమంది చదివినవి : Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా సిరీస్.. ఓటీటీలో ట్రెండింగ్‏లో ఉన్న వెబ్ సిరీస్..

అలాగే 2019లో సింబు నటించిన వంద రాజవ తాన్ వరువెన్ చిత్రంలో నాజర్, రమ్యకృష్ణ ఇద్దరూ తండ్రి కూతురిగా కనిపించారు. ఈ మూడు చిత్రాలలో ఇద్దరూ నటించారు. కానీ ఇద్దరూ వేర్వేరు పాత్రలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒకప్పుడు హీరోగా అలరించిన నాజర్.. ఆ తర్వాత విలన్ పాత్రలలో భయపెట్టారు. అలాగే విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ సినిమాల్లో యాక్టివ్ గా ఉన్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..

నాజర్ ఫోటో..

Nassar

Nassar

ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..

Follow Us