Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..
ప్రేమికులుగా విడిపోయి.. శత్రువులుగా మారితే.. ఇప్పుడు ఈ జానర్ వెబ్ సిరీస్ ఒకటి ఓటీటీలో దూసుకుపోతుంది. ప్రేమ, పగ, క్రూరమైన రాజకీయం వంటి అంశాలతో సాగే ఈ సిరీస్ ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో సంచలనం సృష్టిస్తుంది. ఇంతకీ ఈ సిరీస్ పేరు ఏంటీ అని ఆలోచిస్తున్నారా.. ?

ప్రేమ, నమ్మకద్రోహం, పగ , అధికార దాహం.. ఈ అంశాల నేపథ్యంలో వచ్చిన ‘తుక్రా కే మేరా ప్యార్’ వెబ్ సిరీస్ మొదటి సీజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా మరింత హై-స్టేక్స్ పొలిటికల్ డ్రామా ,థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన ‘తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2’ విడుదలై ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. జూన్ 19 నుండి ఈ సిరీస్ జియో హాట్‌స్టార్ (Jio Hotstar) వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి సీజన్ సాధించిన భారీ విజయం తర్వాత, మేకర్స్ ఈసారి కథను మరింత పెద్ద కాన్వాస్‌పై, ఊహించని మలుపులతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రేమ ఇక ఎంతమాత్రం అమాయకమైనది కాదని, అధికారం కోసం బంధాల నిర్వచనాలు ఎలా మారిపోతాయో ఇందులో అద్భుతంగా చూపించారు. హార్ట్ బ్రేక్, పగ, భావోద్వేగాల మధ్య నలిగే ఈ మైండ్ గేమ్స్ ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్‌ను ఇస్తాయి. నమ్మకం చాలా బలహీనంగా మారిన ఈ క్రూరమైన ఆటలో చివరికి అధురంగా మిగిలిన ప్రేమ గెలుస్తుందా? లేక స్వార్థ రాజకీయం గెలుస్తుందా? అనే విషయాలు తెలియాలంటే జియో హాట్‌స్టార్‌లో ‘తుక్రా కే మేరా ప్యార్ సీజన్ 2’ చూడాల్సిందే!
ఎక్కువ మంది చదివినవి : ఇప్పుడున్న హీరోలలో అతడు ది బెస్ట్.. అతడి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం.. కృష్ణ మనసులోని మాట..
కథలో సరికొత్త మలుపులు:
మొదటి సీజన్‌లో ప్రేక్షకులు షన్విక ,కుల్దీప్ మధ్య సాగిన అందమైన, అంతలోనే ముగిసిపోయిన ప్రేమ ప్రయాణాన్ని చూశారు. కానీ, ఈ సరికొత్త సీజన్‌లో వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. కేవలం ప్రేమ కథగా కాకుండా, ఈసారి వారి కథ క్రూరమైన రాజకీయం, అధికారం ,పగ చుట్టూ తిరుగుతుంది. ఒకప్పుడు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్న షన్విక, కుల్దీప్‌లు.. మారుతున్న పరిస్థితుల వల్ల ఇప్పుడు ఒకరికొకరు శత్రువులుగా, ప్రత్యర్థులుగా ఎదురుపడాల్సి వస్తుంది. అధికారాన్ని దక్కించుకోవడానికి , తమ ఉనికిని కాపాడుకోవడానికి వారు ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడతారనేది ఈ సీజన్ ముఖ్య కథాంశం.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో సినిమాలు… కట్ చేస్తే.. 51 ఏళ్ల వయసులో ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్..
నటీనటుల పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్:
ఈ కొత్త సీజన్‌లో నటుడు ధవల్ ఠాకూర్ మళ్లీ ‘కుల్దీప్ కుమార్’ పాత్రలో కనిపించనున్నారు. గతంలో తను చేసిన తప్పుల వల్ల ఎదురైన పరిణామాలు, ఒక వైపు అపరాధ భావం, మరోవైపు తన ఆశయాల మధ్య నలిగిపోయే కుల్దీప్ పాత్ర ఈసారి మరింత ఇంటెన్స్‌గా సాగుతుంది. ఇక నటి సంచితా బసు ‘షన్విక చౌహాన్’ పాత్రలో మునుపటికంటే ఎంతో శక్తివంతంగా, పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. క్రూరమైన రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి, తన లక్ష్యాలను సాధించడానికి ఆమె ఏవైనా నియమాలను బ్రేక్ చేయడానికి సిద్ధపడుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటే..
