AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అడక్కుండానే లిఫ్ట్ ఇస్తే మహానుభావుడు అనుకున్నారు.. కాసేపటికి..

సంగారెడ్డి జిల్లా చిట్కుల్ సమీపంలో వృద్ధ దంపతులను లక్ష్యంగా చేసుకుని ఓ దుర్మార్గుడు మోసానికి పాల్పడ్డాడు. లిఫ్ట్ ఇస్తానని నమ్మబలికి కారులో ఎక్కించుకున్న అతడు, మంజీరా నది సమీపంలో కారు ఆపి బాధితురాలు నీటి కోసం వెళ్లిన సమయంలో ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకుని కారుతో పరారయ్యాడు.

Telangana: అడక్కుండానే లిఫ్ట్ ఇస్తే మహానుభావుడు అనుకున్నారు.. కాసేపటికి..
Car Lift (Representative Image)
P Shivteja
| Edited By: |

Updated on: Mar 16, 2026 | 3:49 PM

Share

కలికాలంలో మానవత్వం ముసుగులో మృగాలు తిరుగుతున్నాయి…ఆపదలో ఉన్నామని లిఫ్ట్ అడిగితేనే ఇవ్వని రోజుల్లో…తానే లిఫ్ట్ ఇస్తానని నమ్మించి వృద్ధ దంపతుల్ని నిలువు దోపిడీ చేసాడు ఓ దుర్మార్గుడు…ఈ ఘటన సంగారెడ్డి జిల్లా చిట్కుల్ సమీపంలో చోటు చేసుకుంది..వివరాల్లోకి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన గాజం హిమగిరి,సుధాకర్ దంపతులు హైదరాబాద్‌లో ఉంటున్న తమ కుమార్తెను కలిసి, తిరుగు ప్రయాణంలో ఏడుపాయల దుర్గమ్మ దర్శనానికి వెళ్లారు…శనివారం ఉదయం 11 గంటల సమయంలో దర్శనం ముగించుకుని వస్తుండగా,తెల్ల రంగు కారులో వచ్చిన ఒక గుర్తు తెలియని వ్యక్తి వారిని పలకరించాడు..తానే స్వయంగా గమ్యస్థానానికి చేరుస్తానని నమ్మబలికి కారు ఎక్కించు కున్నాడు..మార్గమధ్యలో చిట్కుల్ శివారులోని ప్రసిద్ధ చాముండేశ్వరి ఆలయం ఉందని,అక్కడ కూడా దర్శనం చేసుకుందామని వారిని తీసుకెళ్లాడు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో మంజీరా నది సమీపంలోని ఎనగండ్ల రోడ్డు వద్ద ఫంక్షన్ హాల్ దగ్గర కారు ఆపాడు. బాధితురాలు హిమగిరి మంజీరా నది వద్ద నీటి కోసం వెళ్లగా..అదే అదనుగా భావించిన నిందితుడు ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకుని కారులో మెరుపు వేగంతో పరారయ్యాడు. కోలుకున్న బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిట్కుల్ ఎస్సై నర్సింహులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆ తెల్ల రంగు కారు ఆచూకీ కోసం గాలిస్తున్నారు..గుర్తు తెలియని వ్యక్తులు లిఫ్ట్ ఇస్తామంటే నమ్మవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

Also Read: గ్యాస్ స్టవ్ మంట తక్కువగా వస్తుందా?.. ఇలా చేస్తే వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్! 

Follow Us