AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Margasira Purnima: లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం కావాలంటే.. మార్గశిర పౌర్ణమి రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసా

తిధుల్లో అమావాస్య, పౌర్ణమి తిధులకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కూడా చాలా పవిత్రమైన, ముఖ్యమైన పండుగగా భావిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజిస్తారు. శుభ కార్యాలు కూడా చేస్తారు. అయితే పుణ్యప్రదమైన మార్గశిర పౌర్ణమి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుందాం.

Margasira Purnima: లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం కావాలంటే.. మార్గశిర పౌర్ణమి రోజున ఏమి చేయాలి? ఏమి చేయకూడదో తెలుసా
Margasira Purnima 2024
Surya Kala
|

Updated on: Dec 10, 2024 | 3:52 PM

Share

హిందూ మతంలో మార్గశిర పౌర్ణిమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మార్గశిర మాసం కూడా విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి దేవతలందరికీ ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున పూజించడం వల్ల దేవతలందరూ సంతోషిస్తారు. ఈ రోజున ఆచారాల ప్రకారం పూజించడం వల్ల సుఖం, ఐశ్వర్యం, ఆరోగ్యం, మోక్షం లభిస్తాయి.

పంచాంగం ప్రకారం మార్గశిర మాసం పౌర్ణమి తిథి డిసెంబర్ 14, శనివారం సాయంత్రం 4:58 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 15 ఆదివారం మధ్యాహ్నం 2:31 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం పౌర్ణమి తిథి ఉపవాసం డిసెంబర్ 15న ఆచరిస్తారు. డిసెంబర్ 15 న చంద్రోదయం సాయంత్రం 5:14 గంటలకు జరుగుతుంది.

మార్గశిర పౌర్ణమి రోజున ఏమి చేయాలంటే

  1. స్నానం – పూజ: తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి విష్ణువును పూజించండి.
  2. ఉపవాసం పాటించండి: ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
  3. సత్యనారాయణ కథ వినండి: సత్యన్నారాయణ కథ వినడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పుణ్యం లభిస్తుంది.
  4. రావి చెట్టును పూజించండి: రావి చెట్టును దేవతల నివాసంగా భావిస్తారు. ఈ రోజు రావి చెట్టును పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి.
  5. గంగాస్నానం: వీలైతే గంగాస్నానం చేసి అవసరమైన వారికి దానం చేయండి.
  6. మంత్రాన్ని జపించండి: విష్ణు సహస్రనామం, గాయత్రీ మంత్రం లేదా మీ ఇష్టమైన దేవుడికి సంబంధించిన మంత్రాన్ని జపించండి.
  7. కథ వినండి: మార్గశిర పూర్ణిమ కథ వినండి.
  8. భజన-కీర్తన చేయండి: భజన-కీర్తన చేయడం వల్ల మనసుకు ఆనందం కలుగుతుంది. భక్తి భావం పెరుగుతుంది.

మార్గశిర పౌర్ణమి రోజున ఏమి చేయకూడదంటే

  1. ఈ పనులు చేయవద్దు: అబద్ధాలు చెప్పడం, దొంగతనం చేయడం, ఒకరిని అవమానించడం వంటివి ఈ రోజున చేయకూడదు.
  2. కోపం తెచ్చుకోకండి: మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. కోపానికి దూరంగా ఉండండి.
  3. మాంసాహారానికి దూరంగా ఉండండి: ఈ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి.
  4. ప్రతికూల ఆలోచనలు చేయవద్దు: మీ మనస్సులో సానుకూల ఆలోచనలతో భగవంతుడిని పూజించండి.. ప్రతికూల ఆలోచనలు చేయవద్దు.

మార్గశిర పౌర్ణమి ప్రాముఖ్యత:

మార్గశిర పౌర్ణమి రోజున దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. మార్గశిర పౌర్ణమి రోజున ఆహారం, బట్టలు, డబ్బు వంటి ఏదైనా దానం చేయవచ్చు. ఈ రోజున చేసే పూజల వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయి. పాపాలు నశిస్తాయి. అలాగే ఈ రోజున చేసే పూజ చంద్రుడి ఆశీస్సుతో మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఆధ్యాత్మిక పురోగతికి దారితీస్తుంది.జీవితంలో సానుకూల శక్తి వస్తుంది. అన్ని కోరికలు నెరవేరుతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత