- Telugu News Photo Gallery Spiritual photos Vastu tips : put Brahma Kamal Plant in this place at Home to get Benefits in telugu
Vastu Tips: శివకేశవులకు ఇష్టమైన బ్రహ్మ కమలం మొక్కను ఇంట్లో పెంచుకోవడానికి వాస్తు నియమాలు ఉన్నాయని తెలుసా.. ఏ దిశలో పెంచుకోవాలంటే..
బ్రహ్మ కమలం పువ్వుకు హిందూ మతంలో విశిష్ట స్థానం ఉంది. హిమాలయాల్లో వికసించే ఈ బ్రహ్మ కమలం ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం. ఈ పవిత్రమైన మొక్క భారతదేశం, భూటాన్, నేపాల్, పాకిస్తాన్, నైరుతి చైనాలో 4500 ఏళ్ల క్రితం నుంచి ఉన్నట్లు తెలుస్తోంది. బ్రహ్మ కమలం పువ్వులు నక్షత్రం ఆకారాన్ని పోలి తెల్లని తామరలా కనిపిస్తాయి. మంచి సువాసన తో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. రాత్రి పూసి పగలు వాడిపోయే ఈ బ్రహ్మ కమలం మొక్కను ఇప్పుడు ఇంట్లో కూడా పెంచుకుంటున్నారు. అయితే ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడానికి వాస్తు నియమాలున్నాయి.
Updated on: Dec 10, 2024 | 3:42 PM

సంవత్సరానికి ఒకసారి వికసించే బ్రహ్మకమలం ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం. ఈ పువ్వు జీవిత కాలం ఒక రాత్రి మాత్రమే.. పౌర్ణమి రాత్రి వికసించే ఈ పుష్పం పూర్తిగా వికసించటానికి దాదాపు 2-3 గంటలు అవసరం అవుతుంది. సూర్యోదయం వరకు ఉంటాయి. ఈ బ్రహ్మ కమలం వికసించే సముయం చూడడం అరుదైనది, శుభప్రదమైనదిగా హిందువులు భావిస్తారు.

హిందూ మతంలో ప్రముఖ స్థానం ఉన్న ఈ పువ్వు.. ఏనుగు తలతో గణేశుడు తిరిగి జీవం పోసుకున్న తర్వాత బ్రహ్మ దేవుడు కన్నీళ్ల జారి పడి ఈ మొక్క జీవం పోసుకుందని. ఈ పుష్పానికి ఆధ్యాత్మికంగా విశిష్టస్థానం ఉండడమే కాదు.. కేదార్‌నాథ్‌లోని శివునికి, బద్రీనాథ్‌లో విష్ణువుకు సమర్పిస్తారు.

బ్రహ్మ కమలం ప్రాముఖ్యత కారణంగా బ్రహ్మ కమలం వాస్తు శాస్త్రంలో ఒక ముఖ్యమైన భాగం. అంతేకాదు పువ్వులకు పూజలను కూడా చేస్తారు. బ్రహ్మ కమలంపువ్వుని "రాత్రి పువ్వుల రాణి" అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన మొక్కను ఇంట్లో పెంచుకునే విషయంలో కొన్ని వాస్తు నియమాలున్నాయని వాస్తు శాస్త్రంలో పేర్కొంది. ఈ వాస్తు నియమాలు ఏమిటో తెలుసుకుందాం..

మొక్క ఇంటిలో పెంచుకోవడం వాస్తు ప్రకారం పవిత్రమైనది. విశ్వం సృష్టికర్త బ్రహ్మ కంటి నీరు నుంచి జన్మించిన ఈ పుష్పం తెల్లగా సచ్చంగా కనిపిస్తూ మనసుకి, ఇంటికి సానుకూలతను, శ్రేయస్సును ఆహ్వానిస్తుంది. అంతేకాదు ఈ మొక్క ఉన్న ఇంట్లో అదృష్టం కలిసి వస్తుందని.. అవకాశాలు లభిస్తాయని నమ్మకం. బ్రహ్మ కమలం చ్ఛతకు చిహ్నం. ఈ అరుదైన పువ్వులు ఆత్మను శుద్ధి చేసి అంతర్గత శాంతిని పెంపొందించే శక్తిని కలిగి ఉన్నాయని నమ్ముతారు.

వాస్తు ప్రకారం బ్రహ్మ కమలాన్ని ఎక్కడ ఉంచాలి: వాస్తు శాస్త్రంలో ఇంట్లో బ్రహ్మ కమలం మొక్కను ఎక్కడ పెంచుకోవలనేది కూడా సూచించారు. ఈ మొక్క వాస్తు ప్రకారం ఉండాలి. ఇంటి కేంద్రాన్ని బ్రహ్మస్థానం అంటారు. వాస్తు ప్రకారం బ్రహ్మకమలాన్ని బ్రహ్మస్థానంలో నాటాలి. అంటే ఇంటి ఆవరణ మధ్యలో బ్రహ్మ కమలం మొక్కను పెంచుకోవాలి. ఇలా చేయడం ఇంటి మధ్యలో అన్ని సానుకూల శక్తులను ఆకర్షిస్తుంది.

బ్రహ్మ కమలం మొక్కను ఉంచడానికి మరొక ప్రదేశం ఇంటికి ఈశాన్య దిశ. ఈ దిశ నీటి మూలకానికి సంబంధించినది. ఇంటికి సిరి సంపదలను ఆకర్షిస్తుంది. బ్రహ్మ కమలం పవిత్రమైన మొక్క కనుక మొక్క చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలి. కొంతమంది ఈ మొక్క దగ్గర ముగ్గులు వేసి పూజలు కూడా చేస్తారు.




