AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ప్రయాణికులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఉగాది, రంజాన్‌కు ఆ రూట్‌లలో ప్రత్యేక బస్సులు!

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పూర్తి స్థాయిలో సన్నద్దమైంది. ఈ పండుగ సెలవులకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయం తీసుకుంది. 

Telangana: ప్రయాణికులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఉగాది, రంజాన్‌కు ఆ రూట్‌లలో ప్రత్యేక బస్సులు!
Tgsrtc Special Buses (1)
Anand T
|

Updated on: Mar 16, 2026 | 3:35 PM

Share

ప్రధానంగా ఈ నెల 17, 18 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని. ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేసింది. అలాగే, ఈ నెల 23వ తేదీ తిరుగు ప్రయాణ రద్దీకి అనుగునంగా కూడా తగిన ఏర్పాట్లు చేసింది. ప్రధాన పండుగులు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతోంది

తిరుగు ప్రయాణంలో స్పెషల్ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఏమాత్రం లేనప్పటికీ రద్దీ ఉన్న రూట్లలో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఖాళీ బస్సులను త్వరతగతిన సంస్థ వెనక్కి తెప్పిస్తుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా వాటిని ఆయా రూట్లలో నడిపిస్తుంది. ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16 ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది.

పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే 1.5 వరకు టికెట్ ధరలను సవరించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది. ఈ ఉగాది, రంజాన్ పండుగ సెలవులకు నడిపే  ప్రత్యేక బస్సులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం 1.5 వరకు టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సవరించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే స్పెషల్ బస్సులకు మాత్రమే సవరించిన చార్జీలు వర్తిస్తాయని పేర్కోంది

ఈ నెల 17, 18 తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 23 తేదీల్లో మాత్రమే సవరించిన చార్జీలు అమల్లో ఉంటాయని ఆర్టీసీ పేర్కోంది. స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయని. రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉగాది, రంజాన్ పండుగ రోజుల్లో నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం రాష్ట్రంలో యథావిధిగా అమల్లో ఉంటుందని తెలిపింది.

టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను www.tgsrtcbus.in వెబ్ సైట్‌లో బుక్  చేసుకోవాలని యాజమాన్యం తెలిపింది. ఉగాది, రంజాన్ పండుగల ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 లలో సంప్రదించాలని సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us