- Telugu News Photo Gallery Spiritual photos Money Astrology 2025: Key planets transit 2025 these zodiac signs to become crorepatis details in telugu
Astrology 2025: కీలక గ్రహాల అనుకూలత.. 2025లో ఆ రాశుల వారు కోటీశ్వరలయ్యే ఛాన్స్..!
Money Astrology 2025: కొత్త ఏడాదిలో శని, గురు, రాహు, కేతువులు రాశులు మారుతున్నందువల్ల వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారు తప్పకుండా కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది. శని మార్చి 29న మీనంలోకి, గురువు మే 25న మిథునంలోకి, రాహువు మే 18న కుంభంలోకి, కేతువు కూడా మే 18న సింహ రాశిలోకి మారడం జరుగుతోంది. ఈ మార్పుల వల్ల ఈ రాశులవారికి ఏడాదంతా సువర్ణావకాశాలు లభిస్తాయి. బాగా సంపాదించడానికి కొన్ని మార్గాలు, అవకాశాలు వీరి ముందుకు వస్తాయి. ఏ విధంగా చూసినా 2024 కంటే 2025 ఈ రాశులవారికి అద్భుతంగా, వైభవంగా ఉండబోతోంది.
Updated on: Dec 10, 2024 | 7:51 PM

వృషభం: ఈ రాశివారికి శని, రాహు, గురు, కేతువులు నలుగురూ అత్యధికంగా యోగాలనిచ్చే అవకాశం ఉంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఆదాయ మార్గాలు బాగా విస్తరిస్తాయి. ఆక స్మిక ధన లాభానికి కూడా బాగా అవకాశం ఉంది. ఉద్యోగ స్థానాధిపతి శని లాభ స్థాన ప్రవేశం వల్ల ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా లాభదాయకం అవుతాయి. ఎక్కడ ఎంత పోటీ ఉన్నా విజయం వీరినే వరిస్తుంది.

మిథునం: ఈ రాశికి ఈ నాలుగు ప్రధాన గ్రహాలు అనుకూలంగా మారడం వల్ల విపరీత రాజయోగం ఏర్ప డుతోంది. అత్యధికంగా రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. ప్రముఖులతో కలిసి మెలిసి తిరగడం జరుగుతుంది. ఆదాయపరంగా ఎటువంటి ప్రయత్నం చేసినా తప్పకుండా సఫలమవుతుంది.

కర్కాటకం: ఈ రాశికి శని భాగ్య స్థానంలోకి ప్రవేశించడం పెద్ద అదృష్టంగానే భావించాలి. అష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోవడంతో పాటు, అనేక విధాలుగా భాగ్య యోగాలు కలుగుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ అవకాశాలు బాగా కలిసి వస్తాయి. విదేశీ సంపాదనకు అవకాశం ఉంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. అనేక వైపుల నుంచి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.

కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శని, ఆరులో రాహువు, దశమ స్థానంలో గురువు ప్రవేశం వల్ల రాజ యోగాలు కలుగుతాయి. ఆర్థిక, ఆరోగ్య, వ్యక్తిగత సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభి స్తుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల ద్వారా అపార ధన లాభాలు కలుగుతాయి. ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. ఆస్తి వివాదాలు, సమస్యలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి.

తుల: ఈ రాశికి శనీశ్వరుడు సప్తమ స్థానంలోకి, గురువు భాగ్య స్థానంలోకి రావడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. రాహు, కేతువుల అనుకూలత వల్ల కుటుంబ వ్యవహారాలు కూడా చక్కబడతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది.

మకరం: ఈ రాశికి శని తృతీయంలోకి ప్రవేశించిన కారణంగా ఏలిన్నాటి శని ప్రభావం నుంచి బయట పడడం జరుగుతుంది. అనేక విధాలుగా వృద్ధి చెందడానికి, పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నమైనా నూరు శాతం సఫలమవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవులు లభిస్తాయి.



