ఎగ్ కాఫీ ఎప్పుడైనా ట్రై చేశారా.. ఇలా చేసి తాగితే అమృతమే!
Samatha
16 march 2026
కాఫీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు. చాలా మంది ఎంతో ఇష్టంగా కాఫీ తాగుతుంటారు. కొందరికి అయితే ప్రతి రోజూ ఉదయం కప్పు కాఫీ తాగనిదే, రోజు గడవదు అంటారు.
కాఫీ
అయితే కాఫీలో కోల్డ్ కాఫీ, ఫిల్టర్ కాఫీ అనీ చాలా రకాలు ఉంటాయి. కానీ చాలా మంది ఎగ్ కాఫీ గురించి తెలియదు. కానీ ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.
ఎగ్ కాపీ
ఎగ్ కాఫీ అంటే కాఫీలో గుడ్డు పచ్చ సొన వేసి తయారు చేస్తుంటారు. చాలా క్రిమీ టెక్స్చర్ లో అదిరిపోతుంది. అంతే కాకుండా అమృతం కంటే చాలా అద్భుతంగా ఉంటుందంట.
గుడ్డులోని పచ్చ సొన
మరీ చాలా అద్భుతంగా ఉండే ఈ ఎగ్ కాఫీని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
ఎగ్ కాఫీ తయారీ
గుడ్డు పచ్చసొనతో తయారు చేసే ఈ ఎగ్ కాపీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మొదటగా హనోయ్ నగరంలో పుట్టింది. పాలు దొరకకపోవడంతో గుడ్డు పచ్చ సొనతో ఈ కాఫీని తయారు చేశారు.
అద్భతమైన టేస్ట్
దీని తయారీ కోసం మొదటగా గుడ్డు పచ్చ సొన ఒక బౌల్‌లో తీసుకొని, అందులో చక్కెర లేదా కండెన్డ్స్ మిల్క్ వేసి బాగా విప్ చేయాలి. అది క్రీమీగా అయ్యే వరకు కలపాలి.
పచ్చ సొన, మిల్క్
తర్వాత స్టవ్ ఆన్ చేసి, బ్లాక్ కాఫీ తయారు చేసుకోవాలి. స్ట్రాంగ్ బ్లాక్ కాఫీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో ఈ క్రిమీ గుడ్డు మిశ్రమాన్ని వేసి మెల్లగా కలుపుకోవాలి.
బ్లాక్ కాఫీ తయారీ
అంతే టేస్టీ టేస్టీ ఎగ్ కాఫీ రెడీ. చాలా డిఫరెంట్‌గా కొత్త రుచిని ఇచ్చే ఈ టేస్టీ ఎగ్ కాఫీ ఆలస్యం చేయకుండా, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మరి.