AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏకకాలంలో విజృంభిస్తోన్న రెండు ప్రాణాంతక వ్యాధులు.. కొత్త మహమ్మారి వచ్చే అవకాశం ఉందని WHO హెచ్చరిక

గత కొన్ని వారాలుగా ఆఫ్రికాలో మార్బర్గ్ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్ కారణంగా 60 మందికి పైగా మరణించారు. ఇంతలో నేను ఉన్నా అంటూ X వ్యాధి కేసులు కూడా ఆఫ్రికాలో వేగంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధి కారణంగా 140 మందికి పైగా మరణించారు. ఏకకాలంలో రెండు ప్రాణాంతక వ్యాధుల నుంచి కొత్త మహమ్మారి వచ్చే అవకాశం ఉందని WHO ప్రపంచాన్ని అలెర్ట్ చేసింది.

ఏకకాలంలో విజృంభిస్తోన్న రెండు ప్రాణాంతక వ్యాధులు.. కొత్త మహమ్మారి వచ్చే అవకాశం ఉందని WHO హెచ్చరిక
Diseasex And Marburg Virus
Surya Kala
|

Updated on: Dec 10, 2024 | 4:18 PM

Share

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు మరణించారు. ఆ తర్వాత మంకీపాక్స్ వైరస్ కూడా 100కి పైగా దేశాల్లో వ్యాపించింది. కొన్ని కేసులు ఇంకా నమోదు అవుతూనే ఉన్నాయి. కొన్ని వారాల క్రితం మార్బర్గ్ వైరస్ కూడా వెలుగులోకి వచ్చింది. ఆఫ్రికాలో ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇంతలో.. డిసీజ్ X అనే కొత్త వ్యాధి మానవాళికి ముప్పుగా మారింది. ఆఫ్రికాలో 300 కంటే ఎక్కువ X కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బాడిన పడి 140 మందికి మరణించారు. రెండు ప్రాణాంతక వ్యాధుల కేసులు ఏకకాలంలో పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో.. WHO ప్రజలను అప్రమత్తం చేసింది. తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ వైరస్ కేసుల ప్రమాదం పెరుగుతున్న దృష్ట్యా.. కొత్త అంటువ్యాధి వచ్చే అవకాశం కూడా పెరుగుతోంది.

WHO 2018 సంవత్సరంలో డిసీజ్ X గురించి సమాచారాన్ని ప్రపంచానికి తెలియజేసింది. అయితే ఈ వ్యాధి ఏదైనా వైరస్ లేదా బ్యాక్టీరియా వల్ల వస్తుందా అనేది ఇప్పటి వరకు తెలియదు. ఇప్పటికే ఆఫ్రికాలో హీంబర్గ్ వైరస్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అటువంటి పరిస్థితిలో వ్యాధి X కేసుల కారణంగా..రెండు వ్యాధులు ఏకకాలంలో వ్యాప్తి చెందుతున్నాయి. ఈ రెండూ చాలా ప్రమాదకరమైనవి. వీటిలో ముందుగా డిసీజ్ ఎక్స్ గురించి తెలుసుకుందాం.

వ్యాధి X అంటే ఏమిటంటే

డిసీజ్ X ఒక ప్రమాదకరమైన వ్యాధి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వ్యాధి మరణాల రేటు చాలా ఎక్కువ. ఏడు నెలల క్రితమే ఈ వ్యాధికి సంబంధించి హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు ఈ డిసీజ్ కేసులు పెరుగుతున్నాయి. వ్యాధి రావడానికి గల కారణమేమిటి అనే విషయంలో సరైన సమాచారం లేదు. ఈ వ్యాధి కోవిడ్ కంటే ప్రమాదకరమైనది, ఈ వ్యాధి కేసులు ఆఫ్రికాలో నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఏడు నెలల క్రితం WHO కొన్ని అంటు వ్యాధులను గుర్తించింది. ఈ వ్యాధులు కొత్త అంటువ్యాధులకు కారణమవుతున్నాయని పేర్కొంది. ఈ వ్యాధుల్లో మార్బర్గ్, జికా, ఎబోలా వైరస్, డిసీజ్ X అత్యంత ప్రమాదకరమైనవిగా పరిగణించబడ్డాయి. ఇప్పుడు డిసీజ్ X , మార్బర్గ్ రెండు కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో కొత్త మహమ్మారి వస్తుందన్న భయం ప్రజలను వెంటాడుతోంది.

మార్బర్గ్ వైరస్ అంటే ఏమిటి?

మార్బర్గ్ వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపించింది. ఇది అంటువ్యాది.. ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఆఫ్రికాలో ఈ వైరస్ కారణంగా 60 మందికి పైగా మరణించారు. మార్బర్గ్ వైరస్‌ను రక్తస్రావం కంటి వ్యాధి అని కూడా అంటారు. ఈ వైరస్ శరీరంలోని ఏ భాగం నుంచి అయినా రక్తస్రావం అయ్యేలా చేస్తుంది. వ్యాధి సోకిన తర్వాత తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే, రోగి 10 రోజుల్లో చనిపోవచ్చు. ఇప్పటి వరకు ఈ వైరస్‌కు వ్యాక్సిన్ లేదా ఔషధం లేదు. వ్యాధి X వలె, మార్బర్గ్ కూడా మొదట్లో ఫ్లూ వంటి లక్షణాలతో మొదలవుతుంది. అందుకనే ఈ వ్యాధులను ప్రాధమిక దశలో గుర్తించడం కొంచెం కష్టతరంగా మారింది.

కొత్త మహమ్మారి రాగలదా?

ఆఫ్రికాలో ఏకకాలంలో రెండు వైరస్‌లు విస్తరిస్తున్నాయని అంటువ్యాధి నిపుణుడు డాక్టర్ జుగల్ కిషోర్ తెలిపారు. ప్రస్తుతం వీటి వ్యాప్తి ఒక దేశానికే పరిమితమైనప్పటికీ ఇది ప్రమాదానికి సంకేతం. అయితే ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదు.. కానీ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎందుకంటే మార్బర్గ్ , డిసీజ్ X రెండూ అంటు వ్యాధులు. ఒక వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపించవచ్చు. వీటికి సంబంధించి అలర్ట్ కూడా జారీ చేశారు. అందువల్ల జలు ప్రభావిత దేశాలకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. అంతేకాదు మీ కుటుంబంలో ఎవరైనా ఈ దేశాల నుంచి వచ్చినట్లయితే.. వారి ఆరోగ్యం పట్ల నిరాతరం ప్రత్యేక శ్రద్ధ వహించమని సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..