Gas Cylinder: ప్రజలకు బిగ్ అలర్ట్.. మార్చి 31లోపూ ఇలా చేయకపోతే.. మీకు సిలిండర్లు రానట్టే!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే దేశ వ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న డొమెస్టిక్ LPG కనెక్షన్ వినియోగదారులందరూ ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ e-KYC ని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా దాడుల కారణంగా, ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో పెట్రోలో, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడింది. భారత్‌లో సైతం LPG కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ఎల్‌పీజీ కొరతను తగ్గించేదుకు ప్రభుత్వం వివిధ ముఖ్యమైన విధానాలను ప్రవేశపెట్టింది. అంటే, గ్యాస్ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని పొడిగించింది. అలాగే వినియోగదారులకు ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న డొమెస్టిక్ LPG కనెక్షన్ వినియోగదారులందరూ ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ e-KYC ని పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గ్యాస్ సబ్సిడీని పొందేందుకు, సిలిండర్ల బుకింగ్ ఆగిపోకుండా ఉండేందుకు ఇది అవసరమని ప్రకటించింది. ముఖ్యంగా ఉజ్వల యోజన లబ్ధిదారులు ప్రతి ఆర్థిక సంవత్సరం ఇది పూర్తి చేయాల్సి ఉంటుంది.
గ్యాస్ సిలిండర్ కోసం ఆధార్ eKYC ఎలా చేయాలి?
- ముందుగా, మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లోని ప్లే స్టోర్‌కి యాప్‌కు వెళ్లి ఆధార్ ఫేస్‌ఆర్‌డి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి .
- ఆ తర్వాత, మీరు ఏ కంపెనీ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో ఆ కంపెనీకి సంబంధించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- తర్వాత మీరు మీ వినియోగదారు నంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి యాప్‌లోకి లాగిన్ అవ్వాలి.
- లాగిన్ అయిన తర్వాత, మీరు Re-eKYC లేదా ఆధార్ e-KYC ఎంపికను ఎంచుకోవాలి .
- అక్కడ మీరు మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి, నిబంధనలు, షరతులను యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫేస్ స్కాన్ చేయాలి .
- ఇప్పుడు మీ స్క్రీన్ పై ఆధార్ ఫేస్ ఆర్ డి కెమెరా కనిపిస్తుంది. అప్పుడు మీరు దానిలో మీ ముఖాన్ని స్కాన్ చేయాలి. మీ ముఖం స్కాన్ అయిన వెంటనే గ్రీన్ టిక్ మార్క్ కనిపిస్తుంది.
- స్కాన్ పూర్తయిన తర్వాత, మీ ఆధార్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. దీని తర్వాత, మీరు చివరకు సబ్మిట్ బటన్‌ను నొక్కితే, మీ e-KYC పూర్తైనట్టే
ముఖ్య గమనిక
అయితే LPG గ్యాస్ సిలిండర్ కోసం eKYC ని పూర్తి చేయడానికి మీరు పైన పేర్కొన్న పద్ధతిని అనుసరించి దీన్ని పూర్తి చేసుకొవచ్చు. అయితే ఇక్కడ మీరొక విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీ దీన్ని లేట్ చేస్తే డేట్ ముగిసిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ eKYC ప్రక్రియ మార్చి 31, 2026 నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అందువల్ల, మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలంటే ఈ తేదీ నాటికి eKYC ప్రక్రియను పూర్తి చేయడం ఉత్తమం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
